Be ye
1 కొరింథీయులకు 4:16

క్రీస్తుయేసునందు సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని గనుక మీరు నన్ను పోలినడుచుకొనువారై యుండవలెనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను.

1 కొరింథీయులకు 10:33

ఈలాగు నేను కూడ స్వప్రయోజనమును కోరక, అనేకులు రక్షింపబడవలెనని వారి ప్రయోజనమునుకోరుచు, అన్ని విషయములలో అందరిని సంతోషపెట్టుచున్నాను.

ఫిలిప్పీయులకు 3:17

సహోదరులారా , మీరు నన్ను పోలి నడుచుకొనుడి ; మేము మీకు మాదిరియైయున్న ప్రకారము నడుచుకొను వారిని గురిపెట్టి చూడుడి.

1 థెస్సలొనీకయులకు 1:6

పరిశుద్ధాత్మవలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యము నంగీకరించి, మమ్మును ప్రభువును పోలి నడుచుకొనినవారైతిరి.

2 థెస్సలొనీకయులకు 3:9

మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు.

హెబ్రీయులకు 6:12

మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిదివరకు కనుపరచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాము.

ప్రకారము
రోమీయులకు 15:2

తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతివాడును మేలైన దానియందు అతనిని సంతోషపరచవలెను .

రోమీయులకు 15:3

క్రీస్తు కూడ తన్ను తాను సంతోషపరచుకొన లేదు గాని నిన్ను నిందించువారి నిందలు నా మీద పడెను . అని వ్రాయబడి యున్నట్లు ఆయనకు సంభవించెను.

ఎఫెసీయులకు 5:1

కావున మీరు ప్రియులైన పిల్లలవలె దేవునిపోలి నడుచుకొనుడి.

ఎఫెసీయులకు 5:2

క్రీస్తు మిమ్మును ప్రేమించి, పరిమళ వాసనగా ఉండుటకు మనకొరకు తన్నుతాను దేవునికిఅర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను; ఆలాగుననే మీరును ప్రేమగలిగి నడుచుకొనుడి.

ఫిలిప్పీయులకు 2:4

మీలో ప్రతివాడును తన సొంతకార్యములను మాత్రమేగాక యితరుల కార్యములను కూడ చూడవలెను.

ఫిలిప్పీయులకు 2:5

క్రీస్తుయేసునకు కలిగిన యీ మనస్సు మీరును కలిగియుండుడి.