గ్రుడ్డివారు
మత్తయి 15:30

బహు జనసమూహములు ఆయనయొద్దకు కుంటివారు గ్రుడ్డివారు మూగవారు అంగహీనులు మొదలైన అనేకులను తీసికొనివచ్చి ఆయన పాదములయొద్ద పడవేసిరి; ఆయన వారిని స్వస్థపరచెను.

లూకా 7:22

అప్పుడాయన మీరు వెళ్లి , కన్న వాటిని విన్నవాటిని యోహానుకు తెలుపుడి . గ్రుడ్డివారు చూపు పొందుచున్నారు , కుంటివారు నడుచుచున్నారు , కుష్ఠరోగులు శుద్ధులగుచున్నారు , చెవిటివారు వినుచున్నారు , చనిపోయినవారు లేపబడుచున్నారు , బీదలకు సువార్త ప్రకటింపబడుచున్నది ;

ఊచకాలుచేతులు
1 రాజులు 13:4

బేతేలునందున్న బలిపీఠమునుగూర్చి ఆ దైవజనుడు ప్రకటించిన మాట రాజైన యరొబాము విని, బలిపీఠముమీదనుండి తన చెయ్యి చాపి, వానిని పట్టుకొనుమని చెప్పగా అతడు చాపిన చెయ్యి యెండిపోయెను; దానిని వెనుకకు తీసికొనుటకు అతనికి శక్తిలేకపోయెను.

జెకర్యా 11:17

మందను విడనాడు పనికిమాలిన కాపరికి శ్రమ ; అతని చెయ్యియు కుడి కన్నును తెగవేయబడును ; అతని చెయ్యి బొత్తిగా ఎండిపోవును అతని కుడి కంటికి దృష్టి బొత్తిగా తప్పును.

మార్కు 3:1-4
1

సమాజమందిరములో ఆయన మరల ప్రవేశింపగా అక్కడ ఊచచెయ్యి గలవాడు ఒకడుండెను.

2

అచ్చటి వారు ఆయనమీద నేరము మోపవలెననియుండి, విశ్రాంతి దినమున వానిని స్వస్థపరచునేమో అని ఆయనను కని పెట్టుచుండిరి.

3

ఆయననీవు లేచిన మధ్యను నిలువుమని ఊచచెయ్యిగలవానితో చెప్పి

4

వారిని చూచివిశ్రాంతి దినమున మేలుచేయుట ధర్మమా కీడు చేయుట ధర్మమా? ప్రాణరక్షణ ధర్మమా, ప్రాణహత్య ధర్మమా! అని అడిగెను; అందుకు వారు ఊరకుండిరి.

పడియుండిరి
సామెతలు 8:34

అనుదినము నా గడపయొద్ద కనిపెట్టుకొని నా ద్వారబంధములయొద్ద కాచుకొని నా ఉపదేశము వినువారు ధన్యులు.

విలాపవాక్యములు 3:26

నరులు ఆశకలిగి యెహోవా అనుగ్రహించు రక్షణ కొరకు ఓపికతో కనిపెట్టుట మంచిది.

రోమీయులకు 8:25

మనము చూడని దాని కొరకు నిరీక్షించిన యెడల ఓపిక తో దానికొరకు కనిపెట్టుదుము.

యాకోబు 5:7

సహోదరులారా, ప్రభువు రాకడవరకు ఓపిక కలిగి యుండుడి; చూడుడి; వ్యవసాయకుడు తొలకరి వర్షమును కడవరి వర్షమును సమకూడు వరకు విలువైన భూఫలము నిమిత్తము ఓపికతో కాచుకొనుచు దానికొరకు కనిపెట్టును గదా