నేను చేపలు పట్టబోదునని
2 రాజులు 6:1-7
1

అంతట ప్రవక్తల శిష్యులు ఎలీషా యొద్దకు వచ్చి ఇదిగో నీయొద్ద మాకున్న స్థలము ఇరుకుగా నున్నది;

2

నీ సెలవైతే మేము యొర్దాను నదికి పోయి తల యొక మ్రాను అచ్చటనుండి తెచ్చుకొని మరియొకచోట నివాసము కట్టుకొందుమని మనవి చేయగా అతడు వెళ్లుడని ప్రత్యుత్తరమిచ్చెను .

3

ఒకడు దయచేసి నీ దాసులమైన మాతో కూడ నీవు రావలెనని కోరగా అతడు నేను వచ్చెదనని చెప్పి

4

వారితోకూడ పోయెను ; వారు యొర్దానుకు వచ్చి మ్రానులు నరుకుచుండిరి .

5

ఒకడు దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటి లో పడిపోగా వాడు అయ్యో నా యేలినవాడా , అది యెరవుతెచ్చినదని మొఱ్ఱపెట్టెను గనుక

6

ఆ దైవ జనుడు అదెక్కడ పడెనని అడిగెను ; వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మయొకటి నరికి నీళ్లలో వేయగా గొడ్డలి తేలెను .

7

అతడు దానిని పట్టుకొనుమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనెను .

మత్తయి 4:18-20
18

యేసు గలిలయ సముద్రతీరమున నడుచుచుండగా, పేతురనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను ఇద్దరు సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను; వారు జాలరులు.

19

ఆయన–నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టుజాలరులనుగా చేతునని వారితో చెప్పెను;

20

వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

లూకా 5:10

ఆలాగున సీమోనుతో కూడ పాలివారైన జెబెదయి కుమారులగు యాకోబును యోహానును (విస్మయ మొందిరి). అందుకు యేసు భయపడకుము, ఇప్పటి నుండి నీవు మనుష్యులను పట్టువాడవై యుందువని సీమోనుతో చెప్పెను.

లూకా 5:11

వారు దోనెలను దరికిచేర్చి, సమస్తమును విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి.

అపొస్తలుల కార్యములు 18:3

వారు వృత్తికి డేరాలు కుట్టువారు. పౌలు అదే వృత్తిగలవాడు గనుక వారితో కాపురముండెను; వారు కలిసి పనిచేయుచుండిరి.

అపొస్తలుల కార్యములు 20:34

నా అవసరముల నిమిత్తమును నాతో ఉన్నవారి నిమిత్తమును ఈ నా చేతులు కష్టపడినవని మీకే తెలియును.

1 కొరింథీయులకు 9:6

మరియు పని చేయకుండుటకు నేనును బర్నబాయు మాత్రమే అధికారము లేనివారమా?

1 థెస్సలొనీకయులకు 2:9

అవును సహోదరులారా, మా ప్రయాసమును కష్టమును మీకు జ్ఞాపకమున్నది గదా. మేము మీలో ఎవనికైనను భారముగా ఉండకూడదని రాత్రింబగళ్లు కష్టముచేసి జీవనము చేయుచు మీ

2 థెస్సలొనీకయులకు 3:7-9
7

ఏలాగు మమ్మును పోలి నడుచుకొనవలెనో మీకే తెలియును. మేము మీ మధ్యను అక్రమముగా నడుచుకొనలేదు;

8

ఎవనియొద్దను ఉచితముగా ఆహారము పుచ్చుకొనలేదు; మేము మీలో ఎవనికిని భారముగా ఉండకూడదని ప్రయాసముతోను కష్టముతోను రాత్రింబగళ్లు పనిచేయుచు జీవనము చేసితివిు.

9

మీరు మమ్మును పోలి నడుచుకొనవలెనని మమ్మును మేము మాదిరిగా కనుపరచుకొనుటకే యీలాగు చేసితివిు గాని, మాకు అధికారములేదనిచేయలేదు.

ఆ రాత్రి
లూకా 5:5

సీమోను ఏలినవాడా, రాత్రి అంతయు మేము ప్రయాసపడితివిు గాని మాకేమియు దొరకలేదు; అయినను నీ మాట చొప్పున వలలు వేతునని ఆయనతో చెప్పెను.

1 కొరింథీయులకు 3:7

కాబట్టి వృద్ధి కలుగజేయు దేవునిలోనే గాని, నాటువానిలోనైనను నీళ్లు పోయువానిలోనైనను ఏమియులేదు.