నీవు స్నానముచేసి తైలము రాచుకొని నీ బట్టలు కట్టుకొని ఆ కళ్లమునకు వెళ్లుము ; అతడు అన్న పానములు పుచ్చుకొనుట చాలించువరకు నీవు అతనికి మరుగైయుండుము .
తెకోవనుండి యుక్తిగల యొక స్త్రీని పిలువ నంపించి ఏడ్చుచున్న దానవైనట్టు నటించి దుఃఖవస్త్రములు ధరించుకొని తైలము పూసికొనక బహు కాలము దుఃఖపడిన దానివలెనుండి
నా శత్రువులయెదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు నూనెతో నా తల అంటియున్నావు నా గిన్నె నిండి పొర్లుచున్నది.
అందుమూలమున భూమిలోనుండి ఆహారమును నరుల హృదయమును సంతోషపెట్టు ద్రాక్షారసమును వారి మొగములకు మెరుగునిచ్చు తైలమును నరుల హృదయమును బలపరచు ఆహారమును ఆయన పుట్టించుచున్నాడు
ఎల్లప్పుడు తెల్లని వస్త్రములు ధరించుకొనుము, నీ తలకు నూనె తక్కువచేయకుము.
మూడు వారములు గడచువరకు నేను సంతోషముగా భోజనము చేయ లేకయుంటిని ; మాంసము గాని ద్రాక్షారసము గాని నా నోటి లోనికి రా లేదు , స్నానాభిషేకములను చేసికొనలేదు .
పాత్రలలో ద్రాక్షారసము పోసి పానము చేయుచు పరిమళ తైలము పూసికొనుచుందురు గాని యోసేపు సంతతివారికి కలిగిన ఉపద్రవమును గురించి చింత పడరు .
నీవు విత్తనము విత్తుదువుగాని కొయ్యక యుందువు, ఒలీవపండ్లను ద్రాక్షపండ్లను త్రొక్కుదువు గాని తైలము పూసి కొనకయు ద్రాక్షారసము పానము చేయకయు ఉందువు.
ఉపవాసము చేయుచున్నట్టు మనుష్యులకు కనబడవలెనని కాక, రహస్యమందున్న నీ తండ్రికే కనబడవలెనని, నీవు ఉపవాసము చేయునప్పుడు నీ తల అంటుకొని, నీ ముఖము కడుగుకొనుము.