సముద్రతీరమున
మత్తయి 9:9

యేసు అక్కడనుండి వెళ్లుచు సుంకపు మెట్టునొద్ద కూర్చుండియున్న మత్తయి అను ఒక మనుష్యుని చూచినన్ను వెంబడించుమని అతనితో చెప్పగా అతడు లేచి ఆయనను వెంబడించెను.

మత్తయి 13:1

ఆ దినమందు యేసు ఇంటనుండి వెళ్లి సముద్ర....తీరమున కూర్చుండెను.

జనులందరును
మార్కు 2:2

ఆయన యింట ఉన్నాడని వినవచ్చినప్పుడు అనేకులు కూడివచ్చిరి గనుక వాకిటనైనను వారికి స్థలము లేకపోయెను. ఆయన వారికి వాక్యము బోధించుచుండగా

మార్కు 3:7

యేసు తన శిష్యులతో కూడ సముద్రమునొద్దకు వెళ్లగా, గలిలయనుండి వచ్చిన గొప్ప జనసమూహము ఆయనను వెంబడించెను,

మార్కు 3:8

మరియు ఆయన ఇన్ని గొప్ప కార్యములు చేయుచున్నాడని విని జనులు యూదయనుండియు, యెరూషలేమునుండియు, ఇదూమయనుండియు, యొర్దాను అవతలనుండియు, తూరు సీదోను అనెడి పట్టణప్రాంత ములనుండియు ఆయనయొద్దకు గుంపులు గుంపులుగా వచ్చిరి.

మార్కు 3:20

ఆయన ఇంటిలోనికి వచ్చినప్పుడు జనులు మరల గుంపు కూడి వచ్చిరి గనుక భోజనము చేయుటకైనను వారికి వీలు లేకపోయెను.

మార్కు 3:21

ఆయన ఇంటివారు సంగతి విని, ఆయన మతి చలించియున్నదని చెప్పి ఆయనను పట్టుకొనబోయిరి.

మార్కు 4:1

ఆయన సముద్రతీరమున మరల బోధింప నారంభింపగా, బహు జనులాయనయొద్దకు కూడివచ్చి యున్నందున ఆయన సముద్రములో ఒక దోనెయెక్కి కూర్చుండెను. జనులందరు సముద్రతీరమున నేలమీద నుండిరి.

సామెతలు 1:20-22
20

జ్ఞానము వీధులలో కేకలు వేయుచున్నది సంతవీధులలో బిగ్గరగా పలుకుచున్నది

21

గొప్ప సందడిగల స్థలములలో ప్రకటన చేయుచున్నది పురద్వారములలోను పట్టణములోను జ్ఞానము ప్రచురించుచు తెలియజేయుచున్నది

22

ఎట్లనగా, జ్ఞానములేనివారలారా, మీరెన్నాళ్లు జ్ఞానములేనివారుగా ఉండగోరుదురు? అపహాసకులారా, మీరెన్నాళ్లు అపహాస్యము చేయుచు ఆనందింతురు? బుద్ధిహీనులారా, మీరెన్నాళ్లు జ్ఞానమును అసహ్యించుకొందురు?

లూకా 19:48

ప్రజ లందరు ఆయన వాక్యమును వినుటకు ఆయనను హత్తుకొని యుండిరి గనుక ఏమి చేయవలెనో వారికి తోచ లేదు .

లూకా 21:38

ప్రజ లందరు ఆయన మాట వినుటకు దేవాలయములో ఆయనయొద్దకు పెందలకడ వచ్చుచుండిరి .