ఆయన ఇంకను మాటలాడుచుండగా, సమాజమందిరపు అధికారి యింటనుండి కొందరు వచ్చినీ కుమార్తె చని పోయినది; నీవిక బోధకుని ఎందుకు శ్రమ పెట్టుదువనిరి.
అప్పుడు ఆయన వారిమీద చేతులుంచి ప్రార్థన చేయవలెనని కొందరు చిన్నపిల్లలను ఆయనయొద్దకు తీసికొని వచ్చిరి.
ఊరకుండుడని జనులు వారిని గద్దించిరి గాని వారుప్రభువా, దావీదు కుమారుడా, మమ్ము కరుణింపుమని మరి బిగ్గరగా కేకవేసిరి.
ఊరకుండుమని ముందర నడుచుచుండినవారు వానిని గద్దించిరి గాని, వాడు మరి ఎక్కువగా దావీదు కుమారుడా, నన్ను కరుణించుమని కేకలువేసెను.
ఆ స్త్రీ సురోఫెనికయ వంశ మందు పుట్టిన గ్రీసు దేశస్థురాలు. ఆమె తన కుమార్తెలోనుండి ఆ దయ్యమును వెళ్లగొట్టుమని ఆయనను వేడు కొనెను.
ఆయన ఆమెను చూచిపిల్లలు మొదట తృప్తి పొందవలెను; పిల్లల రొట్టె తీసికొని కుక్కపిల్లలకు వేయుట యుక్తము కాదనెను.
అందుకామెనిజమే ప్రభువా, అయితే కుక్కపిల్లలు కూడ బల్లక్రింద ఉండి, పిల్లలు పడ వేయు రొట్టెముక్కలు తినును గదా అని ఆయనతో చెప్పెను.
అందుకాయనఈ మాట చెప్పినందున వెళ్లుము; దయ్యము నీ కుమార్తెను వదలిపోయినదని ఆమెతో చెప్పెను.
యాకోబు ఒక్కడు మిగిలిపోయెను; ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడెను.
తాను అతని గెలువకుండుట చూచి తొడగూటిమీద అతనిని కొట్టెను. అప్పుడతడు ఆయనతో పెనుగులాడుటవలన యాకోబు తొడ గూడువసిలెను.
ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనిమ్మనగా అతడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనియ్యననెను.
ఆయన నీ పేరేమని యడుగగా అతడు యాకోబు అని చెప్పెను.
అప్పుడు ఆయన నీవు దేవునితోను మనుష్యులతోను పోరాడి గెలిచితివి గనుక ఇకమీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను.
మీరు నన్ను వెదకిన యెడల, పూర్ణమనస్సుతో నన్ను గూర్చి విచారణ చేయునెడల మీరు నన్ను కనుగొందురు,
అందుకాయన ఆమెతో ఒక్క మాటయైనను చెప్పలేదు. అప్పుడాయన శిష్యులు వచ్చిఈమె మన వెంబడి వచ్చి కేకలువేయుచున్నది గనుక ఈమెను పంపి వేయుమని ఆయనను వేడుకొనగా
ఆయనఇశ్రాయేలు ఇంటివారై నశించిన గొఱ్ఱలయొద్దకే గాని మరి ఎవరియొద్దకును నేను పంపబడ లేదనెను
అయినను ఆమె వచ్చి ఆయనకు మ్రొక్కి ప్రభువా, నాకు సహాయము చేయుమని అడిగెను.
అందుకాయనపిల్లల రొట్టెతీసికొని కుక్కపిల్లలకువేయుట యుక్తము కాదని చెప్పగా
ఆమెనిజమే ప్రభువా, కుక్కపిల్లలుకూడ తమ యజమానుల బల్లమీదనుండి పడు ముక్కలు తినును గదా అని చెప్పెను.
అందుకు యేసు అమ్మా, నీ విశ్వాసము గొప్పది; నీవు కోరినట్టే నీకు అవునుగాక అని ఆమెతో చెప్పెను. ఆ గడియలోనే ఆమె కుమార్తె స్వస్థత నొందెను.
మరియు ఆయన వారితో ఇట్లనెను మీలో ఎవనికైన ఒక స్నేహితు డుండగా అతడు అర్ధరాత్రివేళ ఆ స్నేహితుని యొద్దకు వెళ్లి స్నేహితుడా , నాకు మూడు రొట్టెలు బదులిమ్ము ;
నా స్నేహితుడు ప్రయాణముచేయుచు మార్గములో నా యొద్దకు వచ్చియున్నాడు ; అతనికి పెట్టుటకు నాయొద్ద ఏమియు లేదని అతనితో చెప్పినయెడల
అతడు లోపలనే యుండి నన్ను తొందర పెట్టవద్దు ; తలుపు వేసియున్నది , నా చిన్నపిల్లలు నాతో కూడ పండుకొని యున్నారు , నేను లేచి ఇయ్య లేనని చెప్పునా ?
అతడు తన స్నేహితుడై నందున లేచి ఇయ్యక పోయినను , అతడు సిగ్గుమాలి మాటి మాటికి అడుగుటవలన నైనను లేచి అతనికి కావలసిన వన్నియు ఇచ్చును అని మీతో చెప్పుచున్నాను .
అటువలె మీరును అడుగుడి , మీ కియ్యబడును ; వెదకుడి , మీకు దొరకును ; తట్టుడి , మీకు తీయబడును .
అడుగు ప్రతివాని కియ్యబడును , వెదకువానికి దొరకును , తట్టు వానికి తీయబడునని మీతో చెప్పుచున్నాను .
వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలె ననుటకు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను.
దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్య పెట్టకయు నుండు ఒక న్యాయాధిపతి యొక పట్టణములో ఉండెను.
ఆ పట్టణములో ఒక విధవరాలును ఉండెను. ఆమె అతనియొద్దకు తరచుగావచ్చి నా ప్రతివాదికిని నాకును న్యాయము తీర్చుమని అడుగుచు వచ్చెను గాని
అతడు కొంతకాలము ఒప్పకపోయెను. తరువాత అతడు-నేను దేవునికి భయపడకయు మనుష్యులను లక్ష్యపెట్టకయు ఉండినను
ఈ విధవరాలు నన్ను తొందరపెట్టుచున్నది గనుక ఆమె మాటి మాటికి వచ్చి గోజాడకుండునట్లు ఆమెకు న్యాయము తీర్తునని తనలోతాననుకొనెను.
మరియు ప్రభువిట్లనెను అన్యాయస్థుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి.
దేవుడు తాను ఏర్పరచుకొనిన వారు దివారాత్రులు తన్నుగూర్చి మొఱ్ఱపెట్టుకొనుచుండగా వారికి న్యాయము తీర్చడా?
ఆయన వారికి త్వరగా న్యాయము తీర్చును; వారినిషయమే గదా ఆయన దీర్ఘశాంతము చూపుచున్నాడని మీతో చెప్పుచున్నాను. అయినను మనుష్య కుమారుడు వచ్చునప్పుడు ఆయన భూమి మీద విశ్వాసము కనుగొనునా?
ఆత్మవలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు, ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపనచేయుచు మెలకువగా ఉండుడి.
శరీరధారియై యున్న దినములలో మహా రోదనముతోను కన్నీళ్లతోను, తన్ను మరణమునుండి రక్షింపగలవానికి ప్రార్థనలను యాచనలను సమర్పించి,భయభక్తులు కలిగి యున్నందున ఆయన అంగీకరింపబడెను.
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.