అనేకులు తూర్పునుండియు పడమటనుండియు వచ్చి అబ్రాహాముతో కూడను, ఇస్సాకుతో కూడను, యాకోబుతో కూడను, పరలోకరాజ్యమందు కూర్చుందురు గాని
రాజ్య సంబంధులు1 వెలుపటి చీకటిలోనికి త్రోయబడుదురు; అక్కడ ఏడ్పును పండ్లు కొరుకుటయు నుండునని మీతో చెప్పుచున్నాననెను.
మొదటివారు అనేకులు కడపటివారగుదురు, కడపటివారు మొదటివారగుదురు.
ఈ ప్రకారమే కడపటివారు మొదటి వారగుదురు, మొదటివారు కడపటివారగుదురు.
అందుకు వారుమొదటివాడే అనిరి. యేసుసుంకరులును వేశ్యలును మీకంటె ముందుగా దేవుని రాజ్యములో ప్రవేశించుదురని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ప్రజ లందరును సుంకరులును (యోహాను బోధ) విని , అతడిచ్చిన బాప్తిస్మము పొందినవారై , దేవుడు న్యాయవంతుడని యొప్పుకొనిరి గాని
పరిసయ్యులును ధర్మశాస్త్రోపదేశకులును అతని చేత బాప్తిస్మము పొందక , తమ విషయమైన దేవుని సంకల్పమును నిరాకరించిరి .
అందుకు యేసు సీమోనూ , నీతో ఒక మాట చెప్పవలెనని యున్నానని అతనితో అనగా అతడు బోధకుడా , చెప్పుమనెను .
అప్పుడు యేసు అప్పు ఇచ్చు ఒకనికి ఇద్దరు ఋణస్థు లుండిరి . వారిలో ఒకడు ఐదువందల దేనారములును మరియొకడు ఏబది దేనారములును అచ్చియుండిరి .
ఆ అప్పు తీర్చుటకు వారియొద్ద ఏమియు లేకపోయెను గనుక అతడు వారిద్దరిని క్షమించెను . కాబట్టి వీరిలో ఎవడు అతని ఎక్కువగా ప్రేమించునో చెప్పుమని అడిగెను.
అందుకు సీమోను అతడెవనికి ఎక్కువ క్షమించెనో వాడే అని నాకుతోచుచున్నదని చెప్పగా ఆయన నీవు సరిగా యోచించితివని అతనితో చెప్పి
ఆ స్త్రీ వైపు తిరిగి , సీమోనుతో ఇట్లనెను ఈ స్త్రీని చూచుచున్నానే , నేను నీ యింటిలోనికి రాగా నీవు నా పాదములకు నీళ్లి య్య లేదు గాని , యీమె తన కన్నీళ్లతో నా పాదములను తడిపి తన తలవెండ్రుకలతో తుడిచెను .
నీవు నన్ను ముద్దుపెట్టు కొనలేదు గాని , నేను లోపలికి వచ్చి నప్పటి నుండి యీమె నా పాదములు ముద్దుపెట్టుకొనుట మాన లేదు .
నీవు నూనెతో నా తల అంట లేదు గాని ఈమె నా పాదములకు అత్తరు పూసెను .
ఆమె విస్తారముగా ప్రేమించెను గనుక ఆమెయొక్క విస్తార పాపములు క్షమించబడెనని నీతో చెప్పుచున్నాను . ఎవనికి కొంచెముగా క్షమింపబడునో , వాడు కొంచెముగా ప్రేమించునని చెప్పి
ఇదిగో కడపటి వారిలో కొందరు మొదటి వారగుదురు , మొదటి వారిలో కొందరు కడపటి వారగుదురని చెప్పెను.
పరిసయ్యుడు నిలువబడి దేవా, నేను చోరులును అన్యాయస్థులును వ్యభిచారులునైన యితర మనుష్యులవలెనైనను, ఈ సుంకరివలెనైనను ఉండనందుకు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను.
వారమునకు రెండు మారులు ఉపవాసము చేయుచు నా సంపాదన అంతటిలో పదియవ వంతు చెల్లించుచున్నానని తనలోతాను ప్రార్థించు చుండెను.
అయితే సుంకరి దూరముగా నిలుచుండి, ఆకాశమువైపు కన్ను లెత్తుటకైనను ధైర్యముచాలక రొమ్ము కొట్టుకొనుచు దేవా, పాపినైన నన్ను కరుణించుమని పలికెను.
అతనికంటె ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన యింటికి వెళ్లెనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకొనువాడు తగ్గింపబడుననియు తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడుననియు చెప్పెను.
అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి దేవుని వాక్యము మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే; అయినను మీరు దానిని త్రోసివేసి, మిమ్మును మీరే నిత్యజీవమునకు అపాత్రులుగా ఎంచుకొను
ఏలయనగా నీవు భూదిగంతములవరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్యజనులకు వెలుగుగా ఉంచియున్నాను అని ప్రభువు మాకాజ్ఞాపించెననిరి.
అన్యజనులు ఆ మాటవిని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి; మరియు నిత్యజీవమునకు నిర్ణయింపబడిన వారందరు విశ్వసించిరి.
అట్లయితే మనమేమందుము ? నీతిని వెంటాడని అన్యజనులు నీతిని , అనగా విశ్వాస మూలమైన నీతిని పొందిరి ;
అయితే ఇశ్రాయేలు నీతికారణమైన నియమమును వెంటాడినను ఆ నియమమును అందుకొన లేదు ,
వారెందుకు అందుకొన లేదు ? వారు విశ్వాస మూలముగా కాక క్రియల మూలముగా నైనట్లు దానిని వెంటాడిరి .
ఇదిగో నేను అడ్డురాతిని అడ్డు బండను సీయోను లో స్థాపించుచున్నాను ; ఆయన యందు విశ్వాస ముంచువాడు సిగ్గు పరచబడడు అని వ్రాయబడిన ప్రకారము వారు అడ్డురాయి తగిలి, తొట్రుపడిరి .