ఆ చిన్నదాని చెయిపట్టి తలీతాకుమీ అని ఆమెతో చెప్పెను. ఆ మాటకు చిన్నదానా, లెమ్మని నీతో చెప్పుచున్నానని అర్థము.
అతడామెకు చెయ్యి యిచ్చి లేవనెత్తి, పరిశుద్ధులను విధవరాండ్రను పిలిచి ఆమెను సజీవురాలనుగా వారికి అప్పగించెను.
ఆయన గలిలయలో ఉన్నప్పుడు వీరాయనను వెంబడించి ఆయనకు పరిచారము చేసినవారు. వీరు కాక ఆయనతో యెరూష లేమునకు వచ్చిన ఇతర స్త్రీల నేకులును వారిలో ఉండిరి.
యేసునకు ఉపచారము చేయుచు గలిలయ నుండి ఆయనను వెంబడించిన అనేకమంది స్త్రీలు అక్కడ దూరమునుండి చూచుచుండిరి.
పండ్రెండుమంది శిష్యులును , అపవిత్రా త్మలును వ్యాధులును పోగొట్టబడిన కొందరు స్త్రీలును , అనగా ఏడు దయ్యములు వదలి పోయిన మగ్దలేనే అనబడిన మరియయు , హేరోదు యొక్క గృహనిర్వాహకుడగు కూజా భార్యయగు యోహన్నయు , సూసన్నయు ఆయన తో కూడ ఉండిరి .
వీరును ఇతరు లనేకులును , తమకు కలిగిన ఆస్తితో వారికి ఉపచారము (అనేక ప్రాచీన ప్రతులలో-ఆయనకుపచారము అని పాఠాంతరము) చేయుచు వచ్చిరి.