అప్పుడు రాజు తన కుడివైపున ఉన్నవారిని చూచినా తండ్రిచేత ఆశీర్వదింపబడినవారలారా, రండి; లోకము పుట్టినది మొదలుకొని మీకొరకు సిద్ధపరచబడిన రాజ్యమును స్వతంత్రించుకొనుడి.
ప్రభువు వచ్చి యే దాసులు మెలకువగా ఉండుట కనుగొనునో ఆ దాసులు ధన్యులు; అతడు నడుము కట్టుకొని వారిని భోజన పంక్తిని కూర్చుండబెట్టి, తానే వచ్చి వారికి ఉపచారము చేయునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను.
ఎవని ప్రభువు వచ్చి, వాడు ఆలాగు చేయుచుండుట కనుగొనునో ఆ దాసుడు ధన్యుడు.
నా మట్టుకైతే బ్రదుకుట క్రీస్తే , చావైతే లాభము .
అయినను శరీరము తో నేను జీవించుటయే నాకున్న పనికి ఫలసాధనమైన యెడల నేనేమి కోరుకొందునో నాకు తోచ లేదు .
ఈ రెంటి మధ్యను ఇరుకునబడియున్నాను . నేను వెడలిపోయి క్రీస్తు తో కూడ నుండవలెనని నాకు ఆశ యున్నది , అదినాకు మరి మేలు .
నే నిప్పుడే పానార్పణముగ పోయబడుచున్నాను , నేను వెడలిపోవు కాలము సమీపమై యున్నది .
మంచి పోరాటము పోరాడితిని , నా పరుగు కడ ముట్టించితిని , విశ్వాసము కాపాడుకొంటిని .
ఇకమీదట నా కొరకు నీతి కిరీట ముంచబడియున్నది . ఆ దిన మందు నీతిగల న్యాయాధిపతియైన ప్రభువు అది నాకును , నాకు మాత్రమే కాకుండ తన ప్రత్యక్షతను అపేక్షించు వారికందరికిని అనుగ్రహించును .
మరియు మన ప్రభువైన యేసుక్రీస్తు నాకు సూచించిన ప్రకారము నా గుడారమును త్వరగా విడిచి పెట్టవలసివచ్చుననియెరిగి,
నేను ఈ గుడారములో ఉన్నంతకాలము ఈ సంగతులను జ్ఞాపకముచేసి మిమ్మును రేపుట న్యాయమని యెంచుకొనుచున్నాను.
నేను మృతిపొందిన తరువాత3 కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును.
నీ క్రియలను, నీ ప్రేమను, నీ విశ్వాసమును, నీ పరిచర్యను, నీ సహనమును నేనెరుగుదును; నీ మొదటి క్రియల కన్న నీ కడపటి క్రియలు మరియెక్కువైనవని యెరుగుదును.
హెబ్రీభాషలో హార్‌మెగిద్దోనను చోటుకు వారిని పోగుచేసెను.