మరియు ఇశ్రాయేలీయులకు ఆధారమైనవాడు నరుడు కాడు , ఆయన అబద్ధ మాడడు , పశ్చాత్తాప పడడు .
అతని సంతానము శాశ్వతముగా ఉండుననియు అతని సింహాసనము సూర్యుడున్నంతకాలము నా సన్నిధిని ఉండుననియు
ఆ దర్శనవిషయము నిర్ణయకాలమున జరుగును , సమాప్త మగుటకై ఆతురపడుచున్నది , అది తప్పక నెరవేరును , అది ఆలస్యముగా వచ్చినను దానికొరకు కనిపెట్టుము , అది తప్పక జరుగును , జాగు చేయక వచ్చును.
యెహోవానైన నేను మార్పు లేనివాడను గనుక యాకోబు సంతతివారైన మీరు లయము కాలేదు .
ఆకాశమును భూమియు గతించును గాని నా మాటలేమాత్రమును గతిం పవు .
నిత్యజీవమునుగూర్చిన నిరీక్షణతోకూడిన భక్తికి ఆధారమగు సత్యవిషయమైన అనుభవజ్ఞానము నిమిత్తమును, దేవుని దాసుడును యేసుక్రీస్తు అపొస్తలుడునైన పౌలు, మన అందరి విశ్వాస విషయములో
మనయెదుట ఉంచబడిన నిరీక్షణను చేపట్టుటకు శరణా గతులమైన మనకు బలమైన ధైర్యము కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను.
శ్రేష్ఠమైన ప్రతియీవియు సంపూర్ణమైన ప్రతి వరమును, పరసంబంధమైనదై, జ్యోతిర్మయుడగు తండ్రియొద్దనుండి వచ్చును; ఆయనయందు ఏ చంచలత్వమైనను గమనాగమనములవలన కలుగు ఏ ఛాయయైనను లేదు.
దేవా, యిది నీ దృష్టికి స్వల్పవిషయమే; దేవా యెహోవా, నీవు రాబోవు బహుకాలమువరకు నీ సేవకుని సంతతినిగూర్చి సెలవిచ్చి, మనుష్యునితో మనుష్యుడు మాటలాడునట్లు దయ పాలించి నాతో మాటలాడి, నా సంతతి ఘనతజెందునని మాట యిచ్చి యున్నావు.
పూర్వ కాలమున నీవు మా పితరులైన అబ్రాహాము యాకోబులకు ప్రమాణము చేసిన సత్యమును కనికరమును నీవు అనుగ్రహింతువు .