నా జనులారా
మీకా 6:5

నా జనులారా , యెహోవా నీతి కార్యములను మీరు గ్రహించునట్లు మోయాబు రాజైన బాలాకు యోచించినదానిని బెయోరు కుమారుడైన బిలాము అతనికి ప్రత్యుత్తరముగా చెప్పిన మాటలను షిత్తీము మొదలుకొని గిల్గాలు వరకును జరిగిన వాటిని, మనస్సునకు తెచ్చుకొనుడి.

కీర్తనల గ్రంథము 50:7

నా జనులారా, నేను మాటలాడబోవుచున్నాను ఆలకించుడి ఇశ్రాయేలూ, ఆలకింపుము నేను దేవుడను నీ దేవుడను నేను నీ మీద సాక్ష్యము పలికెదను

కీర్తనల గ్రంథము 81:8

నా ప్రజలారా , ఆలంకిపుడి నేను మీకు సంగతి తెలియజేతును అయ్యో ఇశ్రాయేలూ , నీవు మా మాట వినినయెడల ఎంత మేలు!

కీర్తనల గ్రంథము 81:13

అయ్యో నా ప్రజలు నా మాట వినినయెడల ఇశ్రాయేలు నా మార్గముల ననుసరించినయెడల ఎంత మేలు!

మీకేమి
యిర్మీయా 2:5

యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడునాయందు ఏ దుర్నీతి చూచి మీ పితరులు వ్యర్థమైనదాని ననుసరించి, తాము వ్యర్థులగునట్లు నాయొద్దనుండి దూరముగా తొలగి పోయిరి?

యిర్మీయా 2:31

ఈ తరమువార లారా, యెహోవా సెలవిచ్చు మాట లక్ష్యపెట్టుడినేను ఇశ్రాయేలునకు అరణ్యము వలెనైతినా? గాఢాంధకార దేశమువలెనైతినా? మేము స్వేచ్ఛగా తిరుగులాడువార మైతివిు; ఇకను నీయొద్దకు రామని నా ప్రజలేల చెప్పు చున్నారు?

మిమ్ము నేలాగు
యెషయా 43:22

యాకోబూ , నీవు నాకు మొఱ్ఱపెట్టుట లేదు ఇశ్రాయేలూ , నన్నుగూర్చి నీవు విసికితివి గదా.

యెషయా 43:23

దహనబలులుగా గొఱ్ఱమేకల పిల్లలను నాయొద్దకు తే లేదు నీ బలులచేత నన్ను ఘనపరచ లేదు నైవేద్యములు చేయవలెనని నేను నిన్ను బలవంత పెట్టలేదు ధూపము వేయవలెనని నేను నిన్ను విసికింప లేదు .

అది నాతో చెప్పుడి.
కీర్తనల గ్రంథము 51:4

నీకు కేవలము నీకే విరోధముగా నేను పాపము చేసియున్నాను నీ దృష్టియెదుట నేను చెడుతనము చేసియున్నాను కావున ఆజ్ఞ ఇచ్చునప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుదువు తీర్పు తీర్చునప్పుడు నిర్మలుడవుగా అగపడుదువు.

రోమీయులకు 3:4

నీ మాట లలో నీవు నీతిమంతుడవుగా తీర్చబడునట్లును నీవు వ్యాజ్యెమాడునప్పుడు గెలుచునట్లును అని వ్రాయబడిన ప్రకారము ప్రతి మనుష్యుడును అబద్ధికుడగును గాని దేవుడు సత్యవంతుడు కాక తీరడు.

రోమీయులకు 3:5

మన దుర్నీతి దేవుని నీతికి ప్రసిద్ధి కలుగజేసిన యెడల ఏ మందుము ? ఉగ్రతను చూపించు దేవుడు అన్యాయస్థుడగునా ? నేను మనుష్య రీతిగా మాటలాడు చున్నాను;

రోమీయులకు 3:19

ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .