
కల్దీయులు సిరియాబాషతో ఇట్లనిరి -రాజు చిరకాలము జీవించునుగాక. తమరి దాసులకు కల సెలవియ్యుడి; మేము దాని భావమును తెలియజేసెదము.
రాజగు నెబుకద్నెజరు నొద్ద ఈలాగు మనవిచేసిరి రాజు చిరకాలము జీవించును గాక.
కాబట్టి ఆ ప్రధానులును అధిపతులును రాజు నొద్దకు సందడిగా కూడి వచ్చి ఇట్లనిరి -రాజగు దర్యావేషూ, చిరం జీవివై యుందువుగాక.
అందుకు దానియేలు రాజు చిరకాలము జీవించునుగాక.
బత్షెబ సాగిలపడి రాజునకు నమస్కారము చేసి నా యేలినవాడైన రాజగు దావీదు సదాకాలము బ్రదుకును గాక అనెను.
ఆమె ప్రసవము వలన ప్రయాసపడుచున్నప్పుడు మంత్రసాని ఆమెతో–భయపడకుము; ఇదియు నీకు కుమారుడగునని చెప్పెను.
ఆమె మృతిబొందెను; ప్రాణము పోవుచుండగా ఆమె–అతని పేరు బెనోని అనెను; అతని తండ్రి అతనికి బెన్యామీను అను పేరు పెట్టెను.
ఆమె మృతి నొందుచుండగా దగ్గర నిలిచియున్న స్త్రీలు ఆమెతో-భయపడ వద్దు, కుమారుని కంటి వనిరి గాని ఆమె ప్రత్యుత్తర మియ్యకయు లక్ష్య పెట్టకయు నుండినదై
దేవుని మందసము పట్టబడినదను సంగతిని, తన మామయు పెనిమిటియు చనిపోయిన సంగతిని తెలిసికొని ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి పోయెనని చెప్పి తన బిడ్డకు ఈకాబోదు అను పేరు పెట్టెను.
దేవుని మందసము పట్టబడి పోయినందున ప్రభావము ఇశ్రాయేలీయులలోనుండి చెరపట్టబడి పోయెనని ఆమె చెప్పెను.
మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.
మీరు చెప్పు ప్రత్యుత్తరములు నమ్మదగినవి కావు ఇట్టి నిరర్థకమైన మాటలతో మీరేలాగు నన్ను ఓదార్చజూచెదరు?