నేనెన్నడు కదలనని నా క్షేమకాలమున అనుకొంటిని.
మోయాబు తన బాల్యమునుండి నెమ్మది నొందెను ఈ కుండలోనుండి ఆ కుండలోనికి కుమ్మరింపబడకుండ అది మడ్డిమీద నిలిచెను అదెన్నడును చెరలోనికి పోయినది కాదు అందుచేత దాని సారము దానిలో నిలిచియున్నది దాని వాసన ఎప్పటివలెనే నిలుచుచున్నది.
నర పుత్రుడా , తూరు అధిపతితో ఈలాగు ప్రకటింపుము ప్రభువగు యెహోవా సెలవిచ్చునదేమనగా గర్విష్ఠుడవై నే నొక దేవతను , దేవతనైనట్టు సముద్రము మధ్యను నేను ఆసీనుడనై యున్నాను అని నీవనుకొను చున్నావు; నీవు దేవుడవు కాక మానవుడవై యుండియు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్నావు , నీవు దానియేలు నకంటె జ్ఞానవంతుడవు , నీకు మర్మమైనదేదియు లేదు .
నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యము నొందితివి ,
నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి .
నీకు కలిగిన జ్ఞానా తిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి , నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి .
ఐగుప్తు రాజైన ఫరో , నైలునది లో పండుకొనియున్న పెద్ద మొసలీ , నేను నీకు విరోధిని ; నైలునది నాది, నేనే దాని కలుగ జేసితిని అని నీవు చెప్పుకొనుచున్నావే ;
ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మడ్డిమీద నిలిచిన ద్రాక్షారసమువంటివారైయెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనస్సులో అనుకొనువారిని శిక్షింతును.
నా ప్రాణముతో ప్రాణమా , అనేక సంవత్సరములకు ,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది ; సుఖించుము , తినుము , త్రాగుము , సంతోషించుమని చెప్పుకొందునను కొనెను .
అయితే దేవుడు వెఱ్ఱివాడా , యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు ; నీవు సిద్ధపరచినవి ఎవని వగునని ఆతనితో చెప్పెను .
రాత్రివేళ దొంగ ఏలాగు వచ్చునో ఆలాగే ప్రభువు దినము వచ్చునని మీకు బాగుగా తెలియును.
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు