
రాజా , పరలోమందున్న దేవుడు రాజ్యమును అధికారమును బలమును ఘనతయు తమరికి అనుగ్రహించియున్నాడు ; తమరు రాజులకు రాజైయున్నారు .
ఆయన మనుష్యులు నివసించు ప్రతిస్థలమందును , మనుష్యులనేమి భూ జంతువులనేమి ఆకాశ పక్షులనేమి అన్నిటిని ఆయన తమరి చేతి కప్పగించియున్నాడు , వారందరి మీద తమరికి ప్రభుత్వము ననుగ్రహించియున్నాడు; తామే ఆ బంగారపు శిరస్సు
రాజా , ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది; నీవు వృద్ధిపొంది మహా బలముగలవాడవైతివి ; నీ ప్రభావము వృద్ధినొంది ఆకాశమంత ఎత్తాయెను ; నీ ప్రభుత్వము లోకమంతట వ్యాపించియున్నది.
రాజు -బబులోనను ఈ మహా విశాలపట్టణము నా బలా ధికారమును నా ప్రభావ ఘనతను కనపరచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాననుకొనెను .
మొదటిది సింహమును పోలినది గాని దానికి పక్షిరాజు రెక్కలవంటి రెక్కలుండెను . నేను చూచుచుండగా దాని రెక్కలు తీయబడినవి గనుక మనుష్యునివలె అది పాదములు పెట్టుకొని నేల పైన నిలువబడెను . మరియు మానవ మనస్సు వంటి మనస్సు దానికియ్యబడెను .
నీ బాధను నీ ప్రయాసమును నీచేత చేయింపబడిన కఠినదాస్యమును కొట్టివేసి యెహోవా నిన్ను విశ్రమింపజేయు దినమున నీవు బబులోనురాజును గూర్చి అపహాస్యపు గీతము ఎత్తి యీలాగున పాడుదువు బాధించినవారు ఎట్లు నశించిపోయిరి? రేగుచుండిన పట్టణము ఎట్లు నాశనమాయెను?
బబులోను యెహోవా చేతిలో సర్వభూమికి మత్తు కలిగించు బంగారుపాత్రయై యుండెను. దానిచేతి మద్యమును అన్యజనులు త్రాగి మత్తిల్లి యున్నారు.
ఆ స్త్రీ ధూమ్రరక్తవర్ణముగల వస్త్రము ధరించుకొని, బంగారముతోను రత్నములతోను ముత్యములతోను అలంకరింపబడినదై, ఏహ్యమైన కార్యములతోను తాను చేయుచున్న వ్యభిచారసంబంధమైన అపవిత్రకార్యములతోను నిండిన యొక సువర్ణ పాత్రను తన చేత పట్టుకొనియుండెను.
తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్య మొకటి లేచును . అటుతరువాత లోక మంత యేలునట్టి మూడవ రాజ్య మొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.
రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది , అది యొక పార్శ్వముమీద పండుకొని తన నోట పండ్ల మధ్య మూడు ప్రక్కటెముకలను పట్టుకొనినది. కొందరులెమ్ము , విస్తారముగా మాంసము భక్షించుము అని దానితో చెప్పిరి .
నేను ఊలయియను నది ప్రక్కను ఉన్నట్టు నాకు దర్శనము కలిగెను . నేను కన్ను లెత్తి చూడగా , ఒక పొట్టేలు ఆ నది ప్రక్కను నిలిచియుండెను ; దానికి రెండు కొమ్ములు , ఆ కొమ్ములు ఎత్తయినవి గాని యొకటి రెండవ దానికంటె ఎత్తుగా ఉండెను; ఎత్తుగలది దానికి తరువాత మొలిచినది .
ఆ పొట్టేలు కొమ్ముతో పశ్చిమముగాను ఉత్తరముగాను దక్షిణముగాను పొడుచుచుండుట చూచితిని . ఇట్లు జరుగగా దానిని ఎదిరించుటకైనను , అది పట్టకుండ తప్పించుకొనుటకైనను , ఏ జంతువునకును శక్తిలేకపోయెను ; అది తనకిష్టమైనట్టుగా జరిగించుచు బలము చూపుచు వచ్చెను.
ఇప్పుడు సత్యమును నీకు తెలియజేయుచున్నాను ; ఏమనగా ఇంక ముగ్గురు రాజులు పారసీకముమీద రాజ్యము చేసినపిమ్మట అందరికంటె అధికైశ్వర్యము కలిగిన నాలుగవ రాజొకడు వచ్చును. అతడు తనకున్న సంపత్తు చేత బలవంతుడై అందరిని గ్రేకేయుల రాజ్యమునకు విరోధముగా రేపును .
తాము చనిపోయిన తరువాత తమరి రాజ్యముకంటె తక్కువైన రాజ్య మొకటి లేచును . అటుతరువాత లోక మంత యేలునట్టి మూడవ రాజ్య మొకటి లేచును. అది యిత్తడి వంటిదగును.
అటు పిమ్మట చిరుతపులినిపోలిన మరియొక జంతువును చూచితిని . దాని వీపున పక్షిరెక్కలవంటి నాలుగు రెక్కలుండెను ; దానికి నాలుగు తలలుండెను ; దానికి ఆధిపత్య మియ్యబడెను .
నేను ఈ సంగతి ఆలోచించుచుండగా ఒక మేకపోతు పడమట నుండి వచ్చి , కాళ్లు నేల మోప కుండ భూమి యందంతట పరగులెత్తెను; దాని రెండు కన్నుల మధ్యనొక ప్రసిద్ధమైన కొమ్ముండెను .
ఈ మేకపోతు నేను నది ప్రక్కను నిలుచుట చూచిన రెండు కొమ్ములు గల పొట్టేలు సమీపమునకు వచ్చి , భయంకరమైన కోపముతోను బలముతోను దానిమీదికి డీకొని వచ్చెను.
నేను చూడగా ఆమేకపోతు పొట్టేలును కలిసికొని , మిక్కిలి రౌద్రముగలదై దానిమీదికి వచ్చి ఆ పొట్టేలును గెలిచి దాని రెండు కొమ్ములను పగులగొట్టెను . ఆ పొట్టేలు దాని నెదిరింప లేకపోయినందున ఆ మేకపోతు దానిని నేలను పడవేసి త్రొక్కుచుండెను ; దాని బలమును అణచి ఆ పొట్టేలును తప్పించుట ఎవరిచేతను కాకపోయెను .
ఆ మేకపోతు అత్యధికముగా బలము చూపుచువచ్చెను; అది బహుగా పుష్టినొందగా దాని పెద్ద కొమ్ము విరిగెను ; విరిగిన దానికి బదులుగా నాలుగు ప్రసిద్ధమైన కొమ్ములు ఆకాశపు నలు దిక్కులకు నాలుగు పెరిగెను ,
అంతలో శూరుడగు ఒక రాజు పుట్టి మహా విశాలమైన రాజ్యము నేలి యిష్టానుసారముగా జరిగించును .
అతడు రాజైనతరువాత అతని రాజ్యము శిథిలమై ఆకాశపు నలు దిక్కుల విభాగింపబడును . అది అతని వంశపువారికి గాని అతడు ప్రభుత్వము చేసిన ప్రకారము ప్రభుత్వము చేయువారికి గాని విభాగింపబడదు , అతని ప్రభుత్వము వేరుతో పెరికివేయబడును , అతని వంశపువారు దానిని పొందరు గాని అన్యులు పొందుదురు.
అయితే దక్షిణదేశపు రాజును , అతని అధిపతులలో ఒకడును బలముపొందెదరు అతడు, ఇతనికంటె గొప్పవాడై యేలును ; అతని ప్రభుత్వము గొప్ప ప్రభుత్వమగును .
కొన్ని సంవత్సరములైన పిమ్మట వారు ఉభయులు కూడుకొనెదరు . మరియు వారు ఉభయులు సమాధాన పడవలెనని కోరగా దక్షిణదేశపు రాజ కుమార్తె ఉత్తరదేశపు రాజు నొద్దకు వచ్చును . అయినను ఆమె భుజ బలము నిలుపు కొననేరదు ; అతడైనను అతని భుజబలమైనను నిలువదు ; వారు ఆమెను , ఆమెను తీసికొని వచ్చిన వారిని, ఆమెను కనినవారిని , ఈ కాలమందు ఆమెను బలపరచిన వారిని అప్పగించెదరు .
అతనికి బదులుగా ఆమె వంశములో ఒకడు సేనకు అధిపతియై ఉత్తరదేశపు రాజు కోటలో జొరబడి యిష్టానుసారముగా జరిగించుచు వారిని గెలుచును
మరియు అతడు వారి దేవతలను సొమ్ములను విలువగల వారి వెండి బంగారు వస్తువులను సహా చెరపట్టి ఐగుప్తునకు తీసికొనిపోవును . అతడైతే కొన్ని సంవత్సరములు ఉత్తర దేశపురాజు ప్రభుత్వము కంటె ఎక్కువ ప్రభుత్వము చేయును .
అతడు దక్షిణదేశపు రాజు దేశములో జొరబడి మరలి తన రాజ్యమునకు వచ్చును .
అతని కుమారులు యుద్ధము చేయబూని మహా సైన్యముల సమూహమును సమకూర్చుకొందురు . అతడు వచ్చి యేరువలె ప్రవహించి ఉప్పొంగును ; యుద్ధము చేయబూని కోటదనుక వచ్చును.
అంతలో దక్షిణదేశపు రాజు అత్యుగ్రుడై బయలుదేరి ఉత్తరదేశపు రాజు తో యుద్ధము జరిగించును; ఉత్తరదేశపు రాజు గొప్ప సైన్యమును సమకూర్చుకొనినను అది ఓడిపోవును .
ఆ గొప్ప సైన్యము ఓడిపోయినందున దక్షిణదేశపు రాజు మనస్సున అతిశయపడును ; వేలకొలది సైనికులను హతము చేసినను అతనికి జయము కానేరదు .
ఏలయనగా ఉత్తరదేశపు రాజు మొదటి సైన్యముకంటె ఇంక గొప్ప సైన్యమును సమకూర్చుకొని మరల వచ్చును. ఆ కాలాంతమున, అనగా కొన్ని సంవత్సరములైన పిమ్మట అతడు గొప్ప సైన్యమును విశేషమైన సామగ్రిని సమకూర్చి నిశ్చయముగా వచ్చును .
ఆ కాలములయందు అనేకులు దక్షిణదేశపు రాజు తో యుద్ధము చేయుటకు కూడివచ్చెదరు . నీ జనములోని బందిపోటు దొంగలు దర్శనమును రుజువుపరచునట్లు కూడుదురు గాని నిలువలేక కూలుదురు .
అంతలో ఉత్తరదేశపు రాజు వచ్చి ముట్టడి దిబ్బ వేయును . దక్షిణదేశపు రాజుయొక్క బలము నిలువ లేకపోయినందునను , అతడు ఏర్పరచుకొనిన జనము దృఢశౌర్యము పొందక పోయినందునను ఉత్తరదేశపు రాజు ప్రాకారములుగల పట్టణమును పట్టుకొనును.
వచ్చినవాని కెదురుగా ఎవరును నిలువ లేక పోయినందున తనకిష్టమువచ్చినట్టు అతడు జరిగించును గనుక ఆనందముగల ఆ దేశములో అతడుండగా అది అతని బలమువలన పాడైపోవును .
అతడు తన రాజ్యముయొక్క సమస్త బలమును కూర్చుకొని రావలెనని ఉద్దేశింపగా అతనితో సంధిచేయబడును ; ఏమనగా నశింపజేయవచ్చునని యొక కుమార్తెను అతని కిచ్చెదరు , అయితే ఆమె సమ్మ తింపక అతని కలిసి కొనదు .
అతడు ద్వీపముల జనములతట్టు తన మనస్సును త్రిప్పుకొని యనేకులను పట్టుకొనును . అయితే అతనివలన కలిగిన యవమానమును ఒక యధికారి నివారణ చేయును. మరియు ఆయన యవమానము అతనిమీదికి మరల వచ్చునట్లు చేయును, అది అతనికి రాక తప్పదు.
అప్పుడతడు తన ముఖమును తన దేశములోని కోటలతట్టు త్రిప్పుకొనును గాని ఆటంకపడి కూలి అగు పడకపోవును .
అతనికి మారుగా మరియొకడు లేచి ఘనమైన రాజ్యము ద్వారా పన్ను పుచ్చుకొను వానిని లేపును ; కొన్ని దినములైన పిమ్మట అతడు నాశనమగును గాని యీ నాశనము ఆగ్రహమువలననైనను యుద్ధమువలననైనను కలుగదు .