యధిపతి
దానియేలు 1:3

రాజు అష్పెనజు అను తన నపుంసకుల యధిపతిని పిలిపించి అతనికీలాగు ఆజ్ఞాపించెను -ఇశ్రాయేలీయుల రాజవంశములలో ముఖ్యులై, లోపము లేని సౌందర్యమును సకల విద్యా ప్రవీణతయు జ్ఞానమును గలిగి,

దానియేలు 1:10

మీకు అన్న పానములను నియమించిన రాజగు నా యజమానునికి నేను భయపడుచున్నాను ; మీ ఈడు బాలుర ముఖముల కంటె మీ ముఖములు కృశించినట్లు ఆయనకు కనబడ నేల ? అట్లయితే మీరు రాజుచేత నాకు ప్రాణాపాయము కలుగజేతురు.

దానియేలు 1:11

నపుంసకుల యధిపతి దానియేలు , హనన్యా , మిషాయేలు , అజర్యా అనువారిమీద నియమించిన నియామకునితో దానియేలు ఇట్లనెను .

పేళ్లు పెట్టెను
దానియేలు 4:8

కడపట బెల్తెషాజరను నా దేవత పేరునుబట్టి బిరుదుపొందిన దానియేలనువాడు నా యెదుటికి వచ్చెను ; పరిశుద్ధ దేవతల ఆత్మ అతనియందుండెను , కావున నేనతనికి నా కలను చెప్పితిని .

దానియేలు 5:12

ఈ దానియేలు శ్రేష్ఠమైన బుద్ధిగలవాడై కలలు తెలియజేయుటకును , మర్మములు బయలుపరచుటకును , కఠినమైన ప్రశ్నల కుత్తరమిచ్చుటకును జ్ఞానమును తెలివియుగలవాడుగా కనబడెను గనుక ఆ రాజు అతనికి బెల్తెషాజరు అను పేరు పెట్టెను. ఈ దానియేలును పిలువనంపుము , అతడు దీని భావము నీకు తెలియజెప్పును .

ఆదికాండము 41:45

మరియు ఫరో యోసేపునకు జప్నత్పనేహు అను పేరు పెట్టి, అతనికి ఓనుయొక్క యాజకుడైన పోతీఫెర కుమార్తెయగు ఆసెనతు నిచ్చి పెండ్లి చేసెను.

2 రాజులు 23:34

యోషీయా కుమారుడైన ఎల్యాకీమును అతని తండ్రియైన యోషీయాకు మారుగా రాజుగా నియమించి, అతనికి యెహోయాకీమను మారు పేరుపెట్టి యెహోయాహాజును ఐగుప్తుదేశమునకు కొనిపోగా అతడచ్చట మృతిబొందెను .

2 రాజులు 24:17

మరియు బబులోను రాజు అతని పినతండ్రియైన మత్తన్యాకు సిద్కియా అను మారుపేరు పెట్టి అతని స్థానమందు రాజుగా నియమించెను.

హనన్యా
దానియేలు 2:49

అంతట దానియేలు రాజు నొద్ద మనవి చేసికొనగా రాజు షద్రకు మేషాకు అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానము మీద విచారణకర్తలనుగా నియమించెను ; అయితే దానియేలు రాజు సన్నిధిని ఉండెను.

దానియేలు 3:12-30
12

రాజా , తాము షద్రకు , మేషాకు , అబేద్నగో అను ముగ్గురు యూదులను బబులోను దేశములోని రాచకార్యములు విచారించుటకు నియమించితిరి ; ఆ మనుష్యులు తమరి ఆజ్ఞను లక్ష్యపెట్ట లేదు , తమరి దేవతలను పూజించుట లేదు , తమరు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుటయే లేదు అనిరి.

13

అందుకు నెబుకద్నెజరు అత్యాగ్రహమును రౌద్రమును గలవాడై షద్రకును మేషాకును అబేద్నెగోను పట్టుకొని రండని ఆజ్ఞ ఇయ్యగా వారు ఆ మనుష్యులను పట్టుకొని రాజ సన్నిధికి తీసికొని వచ్చిరి.

14

అంతట నెబుకద్నెజరు వారితో ఇట్లనెను -షద్రకూ , మేషాకూ , అబేద్నెగో మీరు నా దేవతను పూజించుట లేదనియు , నేను నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరించుట లేదనియు నాకు వినబడినది. అది నిజమా ?

15

బాకాను పిల్లంగ్రోవిని పెద్దవీణను వీణను సుంఫోనీయను విపంచికను సకల విధములగు వాద్య ధ్వనులను మీరు విను సమయములో సాగిలపడి , నేను చేయించిన ప్రతిమకు నమస్కరించుటకు సిద్ధముగా ఉండిన యెడల సరే మీరు నమస్క రింపని యెడల తక్షణమే మండుచున్న వేడిమిగల అగ్ని గుండము లో మీరు వేయబడుదురు ; నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడెక్కడ నున్నాడు?

16

షద్రకును , మేషాకును , అబేద్నెగోయు రాజుతో ఈలాగు చెప్పిరి -నెబుకద్నెజరూ ,యిందును గురించి నీకు ప్రత్యుత్తర మియ్యవలెనన్న చింత మాకు లేదు .

17

మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల యీ అగ్ని గుండము లోనుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు ;మరియు నీ వశమున పడకుండ ఆయన మమ్మును రక్షించును ; ఒక వేళ ఆయన రక్షింపకపోయినను

18

రాజా , నీ దేవతలను మేము పూజిం పమనియు , నీవు నిలువబెట్టించిన బంగారు ప్రతిమకు నమస్కరిం పమనియు తెలిసికొనుము .

19

అందుకు నెబుకద్నెజరు అత్యా గ్రహము నొందినందున షద్రకు , మేషాకు , అబేద్నెగోయను వారి విషయములో ఆయన ముఖము వికారమాయెను గనుక గుండము ఎప్పటికన్న ఏడంతలు వేడిమిగా చేయుమని యాజ్ఞ ఇచ్చెను.

20

మరియు తన సైన్యములోనుండు బలిష్ఠులలో కొందరిని పిలువనంపించి షద్రకును, మేషాకును, అబేద్నెగోను బంధించి వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో వేయుడని ఆజ్ఞ ఇయ్యగా

21

వారు వారి అంగీలను నిలువుటంగీలను పైవస్త్రములను తక్కిన వస్త్రములను తియ్యకయే, యున్నపాటున ముగ్గురిని వేడిమి గలిగి మండుచున్న ఆ గుండమునడుమ పడవేసిరి.

22

రాజాజ్ఞ తీవ్రమైనందునను గుండము మిక్కిలి వేడిమిగలదైనందునను షద్రకు, మేషాకు, అబేద్నెగోలను విసిరివేసిన ఆ మనుష్యులు అగ్నిజ్వాలలచేత కాల్చబడి చనిపోయిరి.

23

షద్రకు, మేషాకు, అబేద్నెగోయను ఆ ముగ్గరు మనుష్యులు బంధింపబడినవారై వేడిమిగలిగి మండుచున్న ఆ గుండములో పడగా

24

రాజగు నెబుకద్నెజరు ఆశ్చర్యపడి తీవరముగ లేచి-మేము ముగ్గురు మనుష్యులను బంధించి యీ అగ్నిలో వేసితివిుగదా యని తన మంత్రుల నడిగెను. వారురాజా, సత్యమే అని రాజుతో ప్రత్యుత్తరమిచ్చిరి.

25

అందుకు రాజు-నేను నలుగురు మనుష్యులు బంధకములులేక అగ్నిలో సంచరించుట చూచుచున్నాను; వారికి హాని యేమియు కలుగలేదు; నాల్గవవాని రూపము దేవతల రూపమును బోలినదని వారికి ప్రత్యుత్తరమిచ్చెను.

26

అంతట నెబుకద్నెజరు వేడిమి గలిగి మండుచున్న ఆ గుండము వాకిలి దగ్గరకు వచ్చి-షద్రకు, మేషాకు, అబేద్నెగో యనువారలారా, మహోన్నతుడగు దేవుని సేవకులారా, బయటికివచ్చి నాయొద్దకు రండని పిలువగా, షద్రకు, మేషాకు, అబేద్నెగో ఆ అగ్నిలోనుండి బయటికి వచ్చిరి.

27

అధిపతులును సేనాధిపతులును సంస్థానాధిపతులును రాజుయొక్క ప్రధాన మంత్రులును కూడి వచ్చి ఆ మనుష్యులను పరీక్షించి, వారి శరీరములకు అగ్ని యేహాని చేయకుండుటయు, వారి తలవెండ్రుకలలో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనయైనను వారి దేహములకు తగలకుండుటయు చూచిరి.

28

నెబుకద్నెజరు -షద్రకు , మేషాకు , అబేద్నెగోయను వీరి దేవుడు పూజార్హుడు ; ఆయన తన దూత నంపి తన్నాశ్రయించిన దాసులను రక్షించెను . వారు తమ దేవునికి గాక మరి ఏ దేవునికి నమస్క రింపకయు , ఏ దేవుని సేవిం పకయు ఉందుమని తమ దేహములను అప్పగించి రాజుయొక్క ఆజ్ఞను వ్యర్థ పరచిరి .

29

కాగా నేనొక శాసనము నియమించుచున్నాను ; ఏదనగా , ఇవి్వధముగ రక్షించుటకు సమర్థుడగు దేవుడు గాక మరి ఏ దేవుడును లేడు . కాగా ఏ జనులలోగాని రాష్ట్రములో గాని యేభాష మాటలాడువారిలో గాని షద్రకు , మేషాకు , అబేద్నెగో యనువారి దేవుని ఎవడు దూషించునో వాడు తుత్తునియలుగా చేయబడును ; వాని యిల్లు ఎప్పుడును పెంటకుప్పగా ఉండు ననెను .

30

అంతట నుండి రాజు షద్రకు , మేషాకు , అబేద్నెగోయను వారిని బబులోను సంస్థానములో హెచ్చించెను .