
నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొనునట్లు మీ బలిపీఠములు విడువబడి పాడైపోవును , మీ విగ్రహములు ఛిన్నా భిన్నములగును ,సూర్య దేవతకు మీరు నిలిపిన స్తంభములు పడగొట్టబడును , మీ పనులు నాశనమగును , మీ నివాస స్థలములన్నిటిలో నున్న మీ పట్టణములు పాడైపోవును , మీ ఉన్నత స్థలములు విడువబడును ,
ఉన్నత స్థలములను సూర్య దేవతాస్తంభములను యూదావారి పట్టణములన్నిటిలోనుండి తీసివేసెను. అతని యేలుబడియందు రాజ్యము నెమ్మదిగా ఉండెను.
అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.
అతడు ఐగుప్తులోనున్న సూర్యదేవతా పట్టణములోని సూర్యప్రతిమలను విరుగగొట్టి ఐగుప్తు దేవతల గుళ్లను అగ్నిచేత కాల్చివేయును.
ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల యెదుట పడవేసి ,మీ యెముకలను మీ బలిపీఠముల చుట్టు పారవేయుదును .
తమ విగ్రహముల మధ్యను తాము కట్టిన బలిపీఠముల చుట్టును ఎత్తయిన కొండ లన్నిటి మీదను సకల పర్వతముల నడి కొప్పులమీదను పచ్చని చెట్లన్నిటి క్రిందను , పుష్టిపారిన మస్తకి వృక్షము లన్నిటి క్రిందను , తమ విగ్రహము లన్నిటికి పరిమళ ధూపమువేసిన చోటులన్నిటిలోను పడి వారి జనులు హతులై యుండు కాలమున నేనే యెహోవానై యున్నానని మీరు తెలిసికొందురు .
నేను మీ యున్నతస్థలములను పాడుచేసెదను; మీ విగ్రహములను పడగొట్టెదను; మీ బొమ్మల పీనుగులమీద మీ పీనుగులను పడవేయించెదను.
ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున దేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
ఆ ప్రతిమలను తునకలుగా కొట్టించి, అషేరాదేవి ప్రతిమను పడగొట్టించి వాటి స్థానములను నర శల్యములతో నింపెను .
యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి , దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను .
అంతట అతడు నాకు కనబడుచున్న ఆ సమాధి యెవరిదని అడిగినప్పుడు పట్టణపు వారు అది యూదాదేశమునుండి వచ్చి నీవు, బేతేలులోని బలిపీఠమునకు చేసిన క్రియలను ముందుగా తెలిపిన దైవ జనుని సమాధియని చెప్పిరి .
అందుకతడు దానిని తప్పించుడి , యెవడును అతని శల్యములను తీయ కూడదని చెప్పగా వారు అతని శల్యములను షోమ్రోను పట్టణమునుండి వచ్చిన ప్రవక్త శల్యములను తప్పించిరి .
మరియు ఇశ్రాయేలు రాజులు షోమ్రోను పట్టణములలో ఏ ఉన్నతస్థలములలో మందిరములను కట్టించి యెహోవాకు కోపము పుట్టించిరో ఆ మందిరము లన్నిటిని యోషీయా తీసివేసి , తాను బేతేలులో చేసిన క్రియ లన్నిటి ప్రకారము వాటికి చేసెను .
అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకుల నందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నర శల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను .
బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.
యెహోవా వాక్కుఆ కాలమున శత్రువులు యూదారాజుల యెముకలను అధిపతుల యెముకలను యాజకుల యెముకలను ప్రవక్తల యెముకలను యెరూషలేము నివాసులయెముకలను సమాధులలోనుండి వెలుపలికి తీసి
వారు ప్రేమించుచు పూజించుచు అనుసరించుచు విచారణచేయుచు నమస్కరించుచు వచ్చిన ఆ సూర్య చంద్ర నక్షత్రముల యెదుట వాటిని పరచెదరు; అవి కూర్చబడకయు పాతిపెట్టబడకయు భూమిమీద పెంట వలె పడియుండును.