అయినను నీ జనులు యెహోవా మార్గము న్యాయము కాదని యనుకొందురు ; అయితే వారి ప్రవర్తనయే గదా అ న్యాయమైనది ?
అయితే యెహోవా మార్గము న్యాయము కాదని మీరు చెప్పుచున్నారు . ఇశ్రాయేలీయులారా , నా మాట ఆలకించుడి , నా మార్గము న్యాయమే మీ మార్గమే గదా అ న్యాయమైనది ?
అయితే ఇశ్రాయేలీయులు యెహోవా మార్గము న్యాయము కాదని చెప్పుచున్నారు . ఇశ్రాయేలీయులారా , నా మార్గము న్యాయమేగాని మీ మార్గము న్యాయము కాదు .
అట్టివాడు హృదయమున యెహోవామీద కోపించును.
కాబట్టి ఇశ్రాయేలీ యులారా , యెవని ప్రవర్తననుబట్టి వానికి శిక్ష విధింతును . మనస్సు త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కా కుండునట్లు వాటినన్నిటిని విడిచిపెట్టుడి .
ప్రభువా, మనుష్యులకందరికి వారి వారి క్రియల చొప్పున నీవే ప్రతిఫలమిచ్చుచున్నావు. కాగా కృపచూపుటయు నీది.
గూఢమైన ప్రతి యంశమునుగూర్చి దేవుడు విమర్శచేయునప్పుడు ఆయన ప్రతిక్రియను అది మంచిదే గాని చెడ్డదే గాని, తీర్పులోనికి తెచ్చును.
మనుష్యకుమారుడు తన తండ్రి మహిమ గలవాడై తన దూతలతో కూడ రాబోవుచున్నాడు. అప్పుడాయన ఎవని క్రియలచొప్పున వానికి ఫలమిచ్చును.
మేలు చేసినవారు జీవ పునరుత్థానమునకును కీడు చేసినవారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు.
ఎందుకనగా తాను జరిగించిన క్రియలచొప్పున, అవి మంచివైనను సరే చెడ్డవైనను సరే, దేహముతో జరిగించిన వాటి ఫలమును ప్రతివాడును పొందునట్లు మనమందరమును క్రీస్తు న్యాయపీఠము ఎదుట ప్రత్యక్షముకావలయును.
మరియు గొప్పవారేమి కొద్దివారేమి మృతులైనవారందరు ఆ సింహాసనము ఎదుట నిలువబడియుండుట చూచితిని. అప్పుడు గ్రంథములు విప్పబడెను; మరియు జీవగ్రంథమును వేరొక గ్రంథము విప్పబడెను; ఆ గ్రంథములయందు వ్రాయబడియున్న వాటినిబట్టి తమ క్రియలచొప్పున మృతులు తీర్పు పొందిరి.
సముద్రము తనలోఉన్న మృతులను అప్పగించెను; మరణమును పాతాళలోకమును వాటి వశముననున్న మృతులనప్పగించెను; వారిలో ప్రతివాడు తన క్రియల చొప్పున తీర్పుపొందెను.
మరణమును మృతుల లోకమును అగ్నిగుండములో పడవేయబడెను; ఈ అగ్నిగుండము రెండవ మరణము.
ఎవని పేరైనను జీవగ్రంథమందు వ్రాయబడినట్టు కనబడనియెడల వాడు అగ్నిగుండములో పడవేయబడెను.
ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. వానివాని క్రియచొప్పున ప్రతివాని కిచ్చుటకు నేను సిద్ధపరచిన జీతము నాయొద్ద ఉన్నది.