నీ జ్ఞానముచేతను నీ వివేకముచేతను ఐశ్వర్యము నొందితివి ,
నీ ధనాగారములలోనికి వెండి బంగారములను తెచ్చుకొంటివి .
నీకు కలిగిన జ్ఞానా తిశయముచేతను వర్తకము చేతను నీవు విస్తారమైన ఐశ్వర్యము సంపాదించుకొంటివి , నీకు ఐశ్వర్యము కలిగినదని నీవు గర్వించినవాడవైతివి .
కాగా ప్రభువైన యెహోవా ఈ మాట సెలవిచ్చుచున్నాడు దేవునికి తగినంత అభిప్రాయము కలిగియున్న వాడా, ఆలకించుము;
సముద్రపు రేవుల మీద నివసించుదానా , అనేక ద్వీపములకు ప్రయాణముచేయు వర్తక జనమా , ప్రభువైన యెహోవా సెలవిచ్చునదేమనగా తూరు పట్టణమా నేను సంపూర్ణ సౌందర్యము కలదాననని నీ వనుకొనుచున్నావే ;
నీ సరిహద్దులు సముద్రముల మధ్య ఏర్పడెను, నీ శిల్పకారులు నిన్ను సంపూర్ణ సౌందర్యము గలదానిగా చేసియున్నారు.
నీ సౌందర్యము చూచుకొని నీవు గర్వించినవాడవై , నీ తేజస్సు చూచుకొని నీ జ్ఞానమును చెరుపుకొంటివి , కావున నేను నిన్ను నేలను పడవేసెదను , రాజులు చూచుచుండగా నిన్ను హేళనకప్పగించెదను .
నీవు అన్యాయముగా వర్తకము జరిగించి కలుగజేసికొనిన విస్తార దోషములచేత నీవు నీ పరిశుద్ధస్థలములను చెరుపుకొంటివి గనుక నీలో నుండి నేను అగ్ని పుట్టించెదను , అది నిన్ను కాల్చివేయును , జనులందరు చూచుచుండగా దేశము మీద నిన్ను బూడిదెగా చేసెదను .
దేవుడు - మన స్వరూపమందు మన పోలికె చొప్పున నరులను చేయుదము; వారుసముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద ప్రాకు ప్రతి జంతువును ఏలుదురు గాకనియు పలికెను.
దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను; దేవుని స్వరూపమందు వాని సృజించెను; స్త్రీనిగాను పురుషునిగాను వారిని సృజించెను.
దేవుడు తాను చేసినది యావత్తును చూచినప్పుడు అది చాలమంచిదిగనుండెను. అస్తమయమును ఉదయమును కలుగగా ఆరవ దినమాయెను.
నరుల చెడుతనము భూమిమీద గొప్పదనియు, వారి హృదయము యొక్క తలంపులలోని ఊహఅంతయు ఎల్లప్పుడు కేవలము చెడ్డదనియు యెహోవా చూచి
తాను భూమిమీద నరులను చేసినందుకు యెహోవా సంతాపమునొంది తన హృదయములో నొచ్చుకొనెను.
నీతి జనములు ఘనతకెక్కుటకు కారణము పాపము ప్రజలకు అవమానము తెచ్చును.
ఇది యొకటిమాత్రము నేను కనుగొంటిని, ఏమనగా దేవుడు నరులను యథార్థవంతులనుగా పుట్టించెను గాని వారు వివిధమైన తంత్రములు కల్పించుకొనియున్నారు.
తేజోనక్షత్రమా, వేకువచుక్కా, నీవెట్లు ఆకాశమునుండి పడితివి? జనములను పడగొట్టిన నీవు నేలమట్టమువరకు ఎట్లు నరకబడితివి?
మా తలమీదనుండి కిరీటము పడిపోయెను మేము పాపము చేసియున్నాము, మాకు శ్రమ.
ఒకప్పుడు నేను ధర్మశాస్త్రము లేకుండ జీవించుచుంటిని గాని , ఆజ్ఞ వచ్చినప్పుడు పాపమునకు మరల జీవము వచ్చెను; నేనైతే చనిపోతిని .
దేవదూతలు పాపము చేసినప్పుడు దేవుడు వారిని విడిచిపెట్టక, పాతాళలోక మందలి కటిక చీకటిగల బిలములలోనికి త్రోసి, తీర్పుకు కావలిలో ఉంచబడుటకు వారిని అప్పగించెను.