
పర్వతముల విషయమై రోదనమును అంగలార్పును చేయుదును; అరణ్యములోని మేతస్థలములనుబట్టి విలాపము చేయుదును; అవి పాడాయెను. సంచారము చేయువాడెవడును లేడు, పశువుల అరుపులు వినబడవు, ఆకాశ పక్షులును జంతువులును పారిపోయి యున్నవి, అవి తొలగిపోయి యున్నవి.
స్త్రీలారా, యెహోవా మాట వినుడిమీరు చెవియొగ్గి ఆయన నోటిమాట ఆలకించుడి, మీ కుమార్తెలకు రోదనము చేయనేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి.
నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.
నా జనమా, పాడు చేయువాడు హఠాత్తుగా మామీదికి వచ్చుచున్నాడు. గోనెపట్ట కట్టుకొని బూడిదె చల్లుకొనుము; ఏక కుమారుని గూర్చి దుఃఖించునట్లు దుఃఖము సలుపుము ఘోరమైన దుఃఖము సలుపుము.
అయినను మీరు ఆ మాట విననొల్లని యెడల మీ గర్వమునుబట్టి నేను చాటున ఏడ్చుదును; యెహోవామంద చెరపట్టబడి నందున నా నేత్రము బహుగా వలపోయుచు కన్నీరు విడుచుచు నుండును.
నీవు వారితో చెప్పవలసిన మాట ఏదనగానా జనుల కన్యక గొప్ప ఉపద్రవమువలన పీడింపబడుచున్నది, ఘోరమైన గాయము నొందియున్నది; దివారాత్రము మానక నా కన్నులనుండి కన్నీరు కారుచున్నది.
నేను సంతాపము కలిగి యేడ్చుచున్నాను నాకు విముఖులై యుండుడి నా జనమునకు కలిగిన నాశనమునుగూర్చి నన్ను ఓదార్చుటకు తీవరపడకుడి.
రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది కన్నీరు దాని చెంపలమీద కారుచున్నది దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొక డును లేడు దాని చెలికాండ్రందరు దాని మోసపుచ్చిరి వారు దానికి శత్రువులైరి.
నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటిచేత క్షీణించుచున్నవి నా యంతరంగము క్షోభిల్లుచున్నది నా కాలేజము నేలమీద ఒలుకుచున్నది. శిశువులును చంటిబిడ్డలును పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు.
జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొఱ్ఱ పెట్టుదురు. సీయోను కుమారి ప్రాకారమా, నదీప్రవాహమువలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము విరామము కలుగనియ్యకుము నీ కంటిపాపను విశ్రమింపనియ్యకుము.
ఆయన పట్టణమునకు సమీపించి నప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి