కాలము సమీపించుచున్నది; అప్పుడు అది తోఫెతు అనియైనను బెన్‌హిన్నోము లోయ అనియైనను అనబడక వధలోయ అనబడును; పాతిపెట్టుటకు స్థలము లేకపోవువరకు తోఫెతులో శవములు పాతి పెట్టబడును; ఇదే యెహోవా వాక్కు.
ఈ జనుల శవములు ఆకాశపక్షులకును భూజంతువులకును ఆహార మగును, వాటిని తోలివేయువాడు లేకపోవును.
ఉల్లాస ధ్వనియు ఆనందధ్వనియు పెండ్లికుమారుని స్వరమును పెండ్లికుమార్తె స్వరమును యూదా పట్టణములలోను యెరూషలేము వీధులలోను లేకుండచేసెదను; ఈ దేశము తప్పక పాడైపోవును.
ఆ దైవజనుడు యెహోవా ఆజ్ఞచేత బలిపీఠమునకు ఈ మాట ప్రకటనచేసెను బలిపీఠమా బలిపీఠమా, యెహోవా సెలవిచ్చున దేమనగా దావీదు సంతతిలో యోషీయా అను నొక శిశువు పుట్టును; నీమీద ధూపము వేసిన ఉన్నత స్థలముయొక్క యాజకులను అతడు నీమీద అర్పించును; అతడు మనుష్య శల్యములను నీమీద దహనము చేయును.
యోషీయా అటు తిరిగి అచ్చట పర్వతమందున్న సమాధులను చూచి కొందరిని పంపి సమాధులలోనున్న శల్యములను తెప్పించి , దైవ జనుడు యెహోవా మాట చాటించి చెప్పిన ప్రకారము వాటిని బలిపీఠము మీద కాల్చి దాని అపవిత్రపరచెను .
అచ్చట అతడు ఉన్నతస్థలములకు నియమింపబడిన యాజకుల నందరిని బలిపీఠముల మీద చంపించి వాటిమీద నర శల్యములను కాల్పించి యెరూషలేమునకు తిరిగి వచ్చెను .
అతడు చూచుచుండగా జనులు బయలుదేవతల బలిపీఠములను పడగొట్టి, వాటిపైన ఉన్న సూర్య దేవతల విగ్రహములను అతని ఆజ్ఞచొప్పున నరికివేసి, దేవతా స్తంభములను చెక్కిన విగ్రహములను పోత విగ్రహములను తుత్తునియలుగా కొట్టి చూర్ణముచేసి, వాటికి బలులు అర్పించినవారి సమాధులమీద చల్లి వేసిరి.
బయలుదేవత యాజకుల శల్యములను బలిపీఠములమీద అతడు కాల్పించి, యూదాదేశమును యెరూషలేమును పవిత్రపరచెను.
ఇశ్రాయేలీయుల కళేబరములను వారి బొమ్మల యెదుట పడవేసి ,మీ యెముకలను మీ బలిపీఠముల చుట్టు పారవేయుదును .
యెహోవా హస్తము నా మీదికి వచ్చెను . నేను ఆత్మవశుడనైయుండగా యెహోవా నన్ను తోడుకొని పోయి యెముకలతో నిండియున్న యొక లోయ లో నన్ను దింపెను . ఆయన వాటిమధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా
యెహోవా సెలవిచ్చునదేమనగా మోయాబు మూడు సార్లు నాలుగు సార్లు చేసిన దోషములనుబట్టి నేను తప్పకుండ దానిని శిక్షింతును; ఏలయనగా వారు ఎదోము రాజు ఎముకలను కాల్చి సున్నముచేసిరి .