
భూలోకమా, వినుము; ఈ జనులు నా మాటలు వినకున్నారు, నా ధర్మశాస్త్రమును విసర్జించుచున్నారు గనుక తమ ఆలోచనలకు ఫలితమైన కీడు నేను వారిమీదికి రప్పించుచున్నాను.
మీరు ఈ యొర్దాను దాటి స్వాధీనపరచుకొనబోవు దేశములో ఉండకుండ త్వరలోనే బొత్తిగా నశించిపోదురని భూమ్యాకాశములను మీమీద సాక్షులుగా ఉంచుచున్నాను. ఆ దేశమందు బహు దినములుండక మీరు బొత్తిగా నశించిపోదురు.
కాబట్టి మీరు కీర్తన వ్రాసి ఇశ్రాయేలీయులకు నేర్పుడి. ఈ కీర్తన ఇశ్రాయేలీయుల మీద నాకు సాక్ష్యార్థముగా నుండునట్లు దానిని వారికి కంఠపాఠముగా చేయించుము.
ఆకాశమండలమా, చెవినొగ్గుము; నేను మాటలాడుదును భూమండలమా, నా నోటిమాట వినుము.
ఉజ్జియా యోతాము ఆహాజు హిజ్కియాయను యూదారాజుల దినములలో యూదాను గూర్చియు యెరూషలేమును గూర్చియు ఆమోజు కుమారుడగు యెష యాకు కలిగిన దర్శనము.
యెహోవా మాటలాడుచున్నాడు ఆకాశమా, ఆలకించుము; భూమీ, చెవియొగ్గుము. నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసితిని వారు నామీద తిరుగబడియున్నారు.
రాష్ట్రములారా , నాయొద్దకు వచ్చి వినుడి జనములారా , చెవి యొగ్గి ఆలకించుడి భూమియు దాని సంపూర్ణతయు లోకమును దానిలో పుట్టిన దంతయు వినును గాక.
సకల జనులారా , ఆలకించుడి , భూమీ , నీవును నీలోనున్న సమస్తమును చెవి యొగ్గి వినుడి; ప్రభువగు యెహోవా మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు , పరిశుద్దా లయములోనుండి ప్రభువు మీమీద సాక్ష్యము పలుకబోవుచున్నాడు.
యెహోవా సెలవిచ్చు మాట ఆలకించుడి -నీవువచ్చి పర్వతములను సాక్ష్యముపెట్టి వ్యాజ్యెమాడుము , కొండలకు నీ స్వరము వినబడనిమ్ము .
తన జనుల మీద యెహోవాకు వ్యాజ్యెము కలదు, ఆయన ఇశ్రాయేలీయుల మీద వ్యాజ్యెమాడుచున్నాడు ; నిశ్చలములై భూమికి పునాదులుగా ఉన్న పర్వతములారా , యెహోవా ఆడు వ్యాజ్యెము ఆలకించుడి .