a child
ఆదికాండము 18:19

ఎట్లనగా యెహోవా అబ్రాహామును గూర్చి చెప్పినది అతనికి కలుగ జేయునట్లు తన తరువాత తన పిల్లలును తన యింటి వారును నీతి న్యాయములు జరిగించుచు, యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారి కాజ్ఞాపించినట్లు నేనతని నెరిగియున్నాననెను.

ద్వితీయోపదేశకాండమ 4:9

అయితే నీవు జాగ్రత్తపడుము; నీవు కన్నులార చూచినవాటిని మరువకయుండునట్లును, అవి నీ జీవితకాలమంతయు నీ హృదయములోనుండి తొలగిపోకుండునట్లును, నీ మనస్సును బహు జాగ్రత్తగా కాపాడుకొనుము. నీ కుమారులకును నీ కుమారుల కుమారులకును వాటిని నేర్పి

ద్వితీయోపదేశకాండమ 6:7

నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపజేసి, నీ యింట కూర్చుండునప్పుడును త్రోవను నడుచునప్పుడును పండుకొనునప్పుడును లేచునప్పుడును వాటినిగూర్చి మాటలాడవలెను; సూచనగా వాటిని నీ చేతికి కట్టుకొనవలెను.

కీర్తనల గ్రంథము 78:3-6
3

మాకు తెలిసిన సంగతులను మా పితరులు మాకు వివరించిన సంగతులను చెప్పెదను.

4

యెహోవా స్తోత్రార్హక్రియలను ఆయన బలమును ఆయన చేసిన ఆశ్చర్యకార్యములను దాచకుండ వాటిని వారి పిల్లలకు మేము చెప్పెదము.

5

రాగల తరములలో పుట్టబోవు పిల్లలు దాని నెరుగునట్లును వారు లేచి తమ పిల్లలకు దానిని వివరించునట్లును వీరును దేవునియందు నిరీక్షణగలవారై దేవుని క్రియలను మరువకయుండి

6

యథార్థహృదయులు కాక దేవుని విషయమై స్థిరమనస్సులేనివారై తమ పితరులవలె తిరుగబడకయు

ఎఫెసీయులకు 6:4

తండ్రులారా, మీ పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుడి.

2 తిమోతికి 3:15

నీవు నేర్చుకొని రూఢియని తెలిసికొన్నవి యెవరివలన నేర్చుకొంటివో ఆ సంగతి తెలిసికొని, వాటియందు నిలుకడగా ఉండుము.

when
1 సమూయేలు 1:28

కాబట్టి నేను ఆ బిడ్డను యెహోవాకు ప్రతిష్ఠించుచున్నాను; తాను బ్రదుకు దినములన్నిటను వాడు యెహోవాకు ప్రతిష్ఠితుడని చెప్పెను. అప్పుడు వాడు యెహోవాకు అక్కడనే మ్రొక్కెను.

1 సమూయేలు 2:26

బాలుడగు సమూయేలు ఇంకను ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను.

1 సమూయేలు 12:2

రాజు మీ కార్యములను జరిగించును. నేను తల నెరిసిన ముసలివాడను, నా కుమారులు, మీ మధ్యనున్నారు; బాల్యమునాటినుండి నేటివరకు నేను మీ కార్యములను జరిగించుచు వచ్చితిని.

1 సమూయేలు 12:3

ఇదిగో నేనున్నాను, నేనెవని యెద్దునైన తీసికొంటినా? ఎవని గార్దభమునైన పట్టుకొంటినా? ఎవనికైన అన్యాయము చేసితినా? ఎవనినైన బాధపెట్టితినా? న్యాయము నాకు అగపడకుండ ఎవని యొద్దనైన లంచము పుచ్చుకొంటినా? ఆలాగు చేసినయెడల యెహోవా సన్నిధిని ఆయన అభిషేకము చేయించిన వాని యెదుటను వాడు నా మీద సాక్ష్యము పలుకవలెను, అప్పుడు నేను మీ యెదుట దానిని మరల నిత్తుననెను.