మూసచేత వెండిని కొలిమిచేత బంగారును తాను పొందిన కీర్తిచేత నరుని పరిశోధింపవచ్చును.
యెహోవా, నన్ను పరిశీలించుము, నన్ను పరీక్షించుము నా అంతరింద్రియములను నా హృదయమును పరిశోధించుము.
దేవా, నీవు మమ్మును పరిశీలించియున్నావు. వెండిని నిర్మలము చేయురీతిగా మమ్మును నిర్మలులను చేసియున్నావు.
నేను నిన్ను పుటమువేసితిని వెండిని వేసినట్లు కాదు ఇబ్బంది కొలిమిలో నిన్ను పరీక్షించితిని
ఒకని ప్రవర్తననుబట్టి వాని క్రియల ఫలముచొప్పున ప్రతి కారము చేయుటకు యెహోవా అను నేను హృదయమును పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీ క్షించువాడను.
ఆ మూడవ భాగమును నేను అగ్నిలోనుండి వెండిని తీసి శుద్ధపరచి నట్లు శుద్ధపరతును . బంగారమును శోధించి నట్లు వారిని శోధింతును ; వారు నా నామమునుబట్టి మొఱ్ఱపెట్టగా నేను వారి మొఱ్ఱను ఆలకింతును . వీరు నా జనులని నేను చెప్పుదును , యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు .
అయితే ఆయన వచ్చు దినమును ఎవరు సహింపగలరు ? ఆయన అగుపడగా ఎవరు ఓర్వగలరు ? ఆయన కంసాలి అగ్నివంటివాడు , చాకలివాని సబ్బువంటివాడు ;
వెండిని శోధించి నిర్మలము చేయువాడైనట్లు కూర్చునియుండును .లేవీయులు నీతిని అనుసరించి యెహోవాకు నైవేద్యములు చేయునట్లు వెండి బంగారములను నిర్మలము చేయురీతిని ఆయన వారిని నిర్మలులను చేయును.
నశించిపోవు సువర్ణము అగ్నిపరీక్షవలన శుద్ధపరచబడుచున్నది గదా? దానికంటె అమూల్యమైన మీ విశ్వాసము ఈ శోధనలచేత పరీక్షకు నిలిచినదై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును మహిమయు ఘనతయు కలుగుటకు కారణ మగును.
దాని పిల్లలను నిశ్చయముగా చంపెదను. అందువలన అంతరింద్రియములను హృదయములను పరీక్షించువాడను నేనే అని సంఘములన్నియు తెలిసికొనును. మరియు మీలో ప్రతివానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలము ఇచ్చెదను.