
నీతిమంతుల ఆశ సంతోషము పుట్టించును. భక్తిహీనుల ఆశ భంగమైపోవును.
అపాయము రాగా భక్తిహీనుడు నశించును మరణకాలమందు నీతిమంతునికి ఆశ్రయము కలదు.
–తరిమెదను కలిసికొనియెదను దోపుడుసొమ్ము పంచుకొనియెదను వాటివలన నా ఆశ తీర్చుకొనియెదను నా కత్తి దూసెదను నా చెయ్యి వారిని నాశనము చేయునని శత్రువనుకొనెను.
నీవు నీ గాలిని విసరజేసితివి సముద్రము వారిని కప్పెను వారు మహా అగాధమైన నీళ్లలో సీసమువలె మునిగిరి.
దేవుని మరచువారందరి గతి అట్లే ఉండును భక్తిహీనుని ఆశ నిరర్థకమగును అతని ఆశ భంగమగును.
అతడు ఆశ్రయించునది సాలెపురుగు పట్టే.
వారి ప్రాణము వెడలిపోవును వారు మంటిపాలగుదురు. వారి సంకల్పములు నాడే నశించును.
నేను దేవుడనని నిన్ను చంపువాని యెదుట నీవు చెప్పుదువా ? నిన్ను చంపువాని చేతిలో నీవు మానవుడవే కాని దేవుడవు కావు గదా.
నా ప్రాణముతో– ప్రాణమా , అనేక సంవత్సరములకు ,విస్తారమైన ఆస్తి నీకు సమకూర్చబడియున్నది ; సుఖించుము , తినుము , త్రాగుము , సంతోషించుమని చెప్పుకొందునను కొనెను .
అయితే దేవుడు–వెఱ్ఱివాడా , యీ రాత్రి నీ ప్రాణము నడుగుచున్నారు ; నీవు సిద్ధపరచినవి ఎవనివగునని ఆతనితో చెప్పెను .