ఆకస్మికముగా భయము కలుగునప్పుడు దుర్మార్గులకు నాశనము వచ్చునప్పుడు నీవు భయపడవద్దు
యెహోవా నీకు ఆధారమగును నీ కాలు చిక్కుబడకుండునట్లు ఆయన నిన్ను కాపాడును.
భక్తిహీనుడు దేనికి భయపడునో అదే వానిమీదికి వచ్చును నీతిమంతులు ఆశించునది వారికి దొరుకును.
సుడిగాలి వీచగా భక్తిహీనుడు లేకపోవును. నీతిమంతుడు నిత్యము నిలుచు కట్టడమువలె ఉన్నాడు.
ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి, మనుష్యులు ఎదురుచూచుచు ధైర్యముచెడి కూలుదురు .
మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనను మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఉరి వచ్చినట్టు రాకుండ మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండుడి .
ఆ దినము భూమి యందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును .
లోకులు నెమ్మదిగా ఉన్నది, భయమేమియులేదని చెప్పుకొనుచుండగా, గర్భిణిస్త్రీకి ప్రసవవేదన వచ్చునట్లు వారికి ఆకస్మికముగా నాశనము తటస్థించును గనుక వారెంత మాత్రమును తప్పించుకొనలేరు
భూరాజులును, ఘనులును, సవాస్రాధిపతులును, ధనికులును, బలిష్ఠులును, ప్రతి దాసుడును, ప్రతి స్వతంత్రుడును కొండ గుహలలోను
బండల సందులలోను దాగుకొని -సింహాసనాసీనుడైయున్నవానియొక్కయు గొఱ్ఱెపిల్లయొక్కయు ఉగ్రత మహాదినము వచ్చెను; దానికి తాళజాలినవాడెవడు?
మీరు మా మీద పడి ఆయన సన్నిధికిని గొఱ్ఱెపిల్ల ఉగ్రతకును మమ్మును మరుగుచేయుడి అని పర్వతములతోను బండలతోను చెప్పుచున్నారు.
మీ కుండలకు ముళ్లకంపల సెగ తగలకమునుపే అది పచ్చిదైనను ఉడికినదైనను ఆయన దాని నెగరగొట్టుచున్నాడు,
యెహోవా దీర్ఘశాంతుడు, మహా బలముగలవాడు, ఆయన దోషులను నిర్దోషులుగా ఎంచడు, యెహోవా తుపానులోను సుడిగాలిలోను వచ్చువాడు; మేఘములు ఆయనకు పాదధూళిగా నున్నవి.
ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చువారికిని శ్రమ . భూమిమీద మిక్కిలి యిబ్బందియు ఈ ప్రజల మీద కోపమును వచ్చును .
వారు కత్తి వాత కూలుదురు ; చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు; అన్యజనముల కాలములు సంపూర్ణ మగువరకు యెరూషలేము అన్యజనములచేత త్రొక్కబడును .
మరియు సూర్య చంద్ర నక్షత్రములలో సూచనలును , భూమి మీద సముద్ర తరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును .
దుష్క్యార్యము చేయు ప్రతి మనుష్యుని ఆత్మకు , మొదట యూదునికి గ్రీసుదేశస్థునికికూడ , శ్రమయు వేదనయు కలుగును.