మరియు సన్ననారతో చొక్కాయిని బుట్టాపనిగా చేయవలెను. సన్ననారతో పాగాను నేయవలెను; దట్టిని బుట్టాపనిగా చేయవలెను.
అహరోను కుమారులకు నీవు చొక్కాయిలను కుట్టవలెను; వారికి దట్టీలను చేయవలెను; వారికి అలంకారమును ఘనతయు కలుగునట్లు కుళ్లాయిలను వారికి చేయవలెను.
నీవు నీ సహోదరుడైన అహరోనుకును అతని కుమారులకును వాటిని తొడిగింపవలెను; వారు నాకు యాజకులగునట్లు వారికి అభిషేకముచేసి వారిని ప్రతిష్ఠించి వారిని పరిశుద్ధపరచవలెను.
మరియు వారి మానమును కప్పుకొనుటకు నీవు వారికి నారలాగులను కుట్టవలెను.
అప్పుడతడు అహరోను కుమారులను దగ్గరకు తీసికొనివచ్చి వారికి చొక్కాయిలను తొడిగి వారికి దట్టీలను కట్టి వారికి కుళ్లాయిలను పెట్టెను.
శృంగారమైనపాగా ధరించుకొనిన పెండ్లికుమారుని రీతిగాను ఆభరణములతో అలంకరించుకొనిన పెండ్లికుమార్తెరీతి గాను ఆయన రక్షణ వస్త్రములను నాకు ధరింపజేసి యున్నాడు నీతి అను పైబట్టను నాకు ధరింపజేసియున్నాడు కాగా యెహోవానుబట్టి మహానందముతో నేను ఆనందించుచున్నాను నా దేవునిబట్టి నా ఆత్మ ఉల్లసించుచున్నది
అవిసెనార పాగాలు ధరించుకొని నడుములకు జనుపనారబట్ట కట్టుకొనవలెను , చెమట పుట్టించునదేదైనను వారు ధరింప కూడదు .
అది యేసు క్రీస్తునందలి విశ్వాస మూలమైనదై ,నమ్ము వారందరికి కలుగు దేవుని నీతియైయున్నది .
మెట్టుకు ప్రభువైన యేసు క్రీస్తును ధరించుకొనినవారై , శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసికొనకుడి .
క్రీస్తులోనికి బాప్తిస్మముపొందిన మీరందరు క్రీస్తును ధరించుకొనియున్నారు.
ఆయన దేవుని స్వరూపము కలిగినవాడైయుండి, దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని యెంచుకొనలేదు గాని
మనుష్యుల పోలికగా పుట్టి, దాసుని స్వరూపమును ధరించుకొని, తన్ను తానే రిక్తునిగా చేసికొనెను.
మరియు, ఆయన ఆకారమందు మనుష్యుడుగా కనబడి, మరణము పొందునంతగా, అనగా సిలువమరణము పొందునంతగా విధేయత చూపినవాడై, తన్నుతాను తగ్గించుకొనెను.
కాబట్టి మీ మనస్సు అను నడుముకట్టుకొని నిబ్బరమైన బుద్ధిగలవారై, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడు కృపవిషయమై సంపూర్ణ నిరీక్షణ కలిగియుండుడి.