నా దినముల పరిమాణము నీవు బెత్తెడంతగా చేసియున్నావు నీ సన్నిధిని నా ఆయుష్కాలము లేనట్టేయున్నది. ఎంత స్థిరుడైనను ప్రతివాడును కేవలము వట్టి ఊపిరివలె ఉన్నాడు.(సెలా.)
మనుష్యులు వట్టి నీడవంటివారై తిరుగులాడుదురు. వారు తొందరపడుట గాలికే గదా వారు ధనము కూర్చుకొందురు గాని అది ఎవనికి చేజిక్కునో వారికి తెలియదు.
నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకముచేసికొనుము.నా కన్ను ఇకను మేలు చూడదు.
పరుగుమీద పోవువానికంటె నా దినములు త్వరగా గతించుచున్నవి క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి.
రెల్లుపడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును ఎరమీదికి విసురున దిగు పక్షిరాజువలె అవి త్వరపడిపోవును.
జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి,ఆ సంగతి జ్ఞాపకము చేసికొనుము నీవు నన్ను మరల మన్నుగా చేయుదువా?
స్త్రీ కనిన నరుడు కొద్ది దినములవాడై మిక్కిలిబాధనొందును.
రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవమేపాటిది? మీరు కొంతసేపు కనబడి అంతలో మాయమైపోవు ఆవిరి వంటివారే.