సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.
కావున ఆయన సన్నిధిని నేను కలవరపడుచున్నాను నేను ఆలోచించునప్పుడెల్ల ఆయనకు భయపడుచున్నాను.
దేవుడు నా హృదయమును క్రుంగజేసెను, సర్వశక్తుడే నన్ను కలవరపరచెను.
దేవుని మహాత్మ్యము ఎదుట నేను నిలువజాలననియు ఆయన నన్ను నిర్మూలము చేయుననియు భీతిపుట్టెను.
ఆపత్కాలమందు నీవే నా ఆశ్రయము, నాకు అధైర్యము పుట్టింపకుము.
నేను ఆపదలతో నిండియున్నాను నా ప్రాణము పాతాళమునకు సమీపించియున్నది .
సమాధిలోనికి దిగువారిలో నేనొకనిగా ఎంచబడితిని . నేను త్రాణలేనివానివలె అయితిని .
చచ్చినవారిలో విడువబడినవాడనైతిని నేను సమాధిలో పడియున్న హతులలో ఒకనివలె అయితిని నీవిక స్మరింపనివారివలె అయితిని వారు నీ చేతిలోనుండి తొలగిపోయియున్నారు గదా.
అగాధమైన గుంటలోను చీకటిగల చోట్లలోను అగాధ జలములలోను నీవు నన్ను పరుండబెట్టియున్నావు .
నీ ఉగ్రత నామీద బరువుగానున్నది నీ తరంగములన్నియు నన్ను ముంచుచున్నవి . (సెలా.)
నా నెళవరులను నాకు దూరముగా నీవు ఉంచియున్నావు నీవు వారి దృష్టికి నన్ను హేయునిగా చేసియున్నావు వెలుపలికి రావల్లగాకుండ నేను బంధింపబడియున్నాను
బాధచేత నా కన్ను క్షీణించుచున్నది యెహోవా , ప్రతిదినము నేను నీకు మొఱ్ఱపెట్టుచున్నాను నీవైపు నా చేతులు చాపుచున్నాను .
మృతులకు నీవు అద్భుతములు చూపెదవా ? ప్రేతలు లేచి నిన్ను స్తుతించెదరా ?(సెలా.)
సమాధిలో నీ కృపను ఎవరైన వివరింతురా ? నాశనకూపములో నీ విశ్వాస్యతను ఎవరైన చెప్పుకొందురా?
అంధకారములో నీ అద్భుతములు తెలియనగునా ? పాతాళములో నీ నీతి తెలియనగునా ?
యెహోవా , నేను నీతోనే మనవి చేయుచున్నాను ఉదయమున నా ప్రార్థన నిన్ను ఎదుర్కొనును .
యెహోవా , నీవు నన్ను విడుచుట యేల ? నీ ముఖము నాకు చాటుచేయుట యేల?
బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను .
నీ కోపాగ్ని నా మీదికి పొర్లియున్నది నీ మహాభయములు నన్ను సంహరించియున్నవి .
నీళ్లు ఆవరించునట్లు అవి దినమంత నన్ను ఆవరించుచున్నవి అవి నన్ను చుట్టూర చుట్టుకొనియున్నవి
నా ప్రియులను స్నేహితులను నీవు నాకు దూరముగా ఉంచియున్నావు చీకటియే నాకు బంధువర్గమాయెను .
కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
నెమ్మదికిని నాకును ఆయన బహు దూరము చేసి యున్నాడు మేలు ఎట్టిదో నేను మరచియున్నాను.
సజీవులేల మూల్గుదురు? నరులు తమ పాపశిక్షనుబట్టి ఏల మూల్గుదురు?
నా గుండె నాలో వేదనపడుచున్నది మరణభయము నాలో పుట్టుచున్నది
దిగులును వణకును నాకు కలుగుచున్నవి మహా భయము నన్ను ముంచివేసెను.
నా ప్రాణము తల్లడిల్లగా భూదిగంతములనుండి నీకు మొఱ్ఱ పెట్టుచున్నాను నేను ఎక్కలేనంత యెత్తయిన కొండపైకి నన్ను ఎక్కించుము.