అందువలన నా హృదయము సంతోషించుచున్నది నా ఆత్మ హర్షించుచున్నది నా శరీరముకూడ సురక్షితముగా నివసించుచున్నది
నా ప్రాణమా, మేలుకొనుము స్వరమండలమా సితారా, మేలుకొనుడి నేను వేకువనే లేచెదను.
నా ప్రాణమా, వారి ఆలోచనలో చేరవద్దు నా ఘనమా, వారి సంఘముతో కలిసికొనవద్దు వారు, కోపమువచ్చి మనుష్యులను చంపిరి తమ స్వేచ్ఛచేత ఎద్దుల గుదికాలి నరములను తెగగొట్టిరి.
ఆయన వారిని చూచి వీరు ఊరకుండిన యెడల ఈ రాళ్లు కేకలు వేయునని మీతో చెప్పుచున్నాననెను .
మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకయుండలేమని వారికి ఉత్తరమిచ్చిరి;
నాకు మహోపకారములు చేసియున్నాడు నేను ఆయనను కీర్తించెదను.
నేను ఎల్లప్పుడు నిరీక్షింతును నేను మరి యెక్కువగా నిన్ను కీర్తింతును
నేను నిన్ను కీర్తించునప్పుడు నా పెదవులును నీవు విమోచించిన నా ప్రాణమును నిన్నుగూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడియున్నారు
అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.
యెహోవాను స్తుతించుడి. నా ప్రాణమా, యెహోవాను స్తుతింపుము
నా జీవితకాలమంతయు నేను యెహోవాను స్తుతించెదను నేను బ్రతుకుకాలమంతయు నా దేవుని కీర్తించెదను
ఈ నాలుగు జీవులలో ప్రతి జీవికి ఆరేసి రెక్కలుండెను, అవి చుట్టును రెక్కల లోపటను కన్నులతో నిండియున్నవి. అవి- భూత వర్తమాన భవిష్యత్కాలములలో ఉండు సర్వాధికారియు దేవుడునగు ప్రభువు పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, అని మానక రాత్రింబగళ్లు చెప్పుచుండును.
ఆ సింహాసనము నందు ఆసీనుడైయుండి యుగయుగములు జీవించుచున్నవానికి మహిమయు ఘనతయు కృతజ్ఞతాస్తుతులును కలుగునుగాకని ఆ జీవులు కీర్తించుచుండగా
యుగయుగములవరకు మా దేవునికి స్తోత్రమును మహిమయు జ్ఞానమును కృతజ్ఞతాస్తుతియు ఘనతయు శక్తియు బలమును కలుగును గాకని చెప్పుచు దేవునికి నమస్కారము చేసిరి; ఆమేన్.