అగ్ని వడగండ్లారా, హిమమా, ఆవిరీ, ఆయన ఆజ్ఞను నెరవేర్చు తుపానూ,
అదివరకు పొలమందలి యే పొదయు భూమిమీద నుండలేదు. పొలమందలి యే చెట్టును మొలవలేదు; ఏలయనగా దేవుడైన యెహోవా భూమిమీద వాన కురిపించలేదు, నేలను సేద్యపరచుటక నరుడులేడు;
అయితే ఆవిరి భూమినుండి లేచి నేల అంతటిని తడిపెను.
అనేకదినములైన తరువాత మూడవ సంవత్సరమందు... యెహోవా వాక్కు ఏలీయాకు ప్రత్యక్షమై నేను భూమి మీద వర్షము కురిపింపబోవుచున్నాను; నీవు వెళ్లి అహాబును దర్శించుమని సెలవియ్యగా,
పిమ్మట ఏలీయా విస్తారమైన వర్షము వచ్చునట్లుగా ధ్వని పుట్టుచున్నది, నీవు పోయి భోజనము చేయుమని అహాబుతో చెప్పగా
అహాబు భోజనము చేయబోయెను గాని, ఏలీయా కర్మెలు పర్వతముమీదికి పోయి నేలమీద పడి ముఖము మోకాళ్లమధ్య ఉంచుకొనెను.
తరువాత అతడు తన దాసుని పిలిచి నీవు పైకిపోయి సముద్రమువైపు చూడుమనగా వాడు మెరకయెక్కి పారజూచి ఏమియు కనబడలేదనగా అతడు ఇంక ఏడు మారులు పోయి చూడుమని చెప్పెను.
ఏడవ మారు అతడు చూచి అదిగో మనిషి చెయ్యి యంత చిన్న మేఘము సముద్రమునుండి పైకి ఎక్కుచున్నదనెను. అప్పుడు ఏలీయా నీవు అహాబు దగ్గరకు పోయి నీవు వెళ్లకుండ వర్షము నిన్ను ఆపకుండునట్లు నీ రథమును సిద్ధపరచుకొని పొమ్మని చెప్పుమని వానిని పంపెను.
అంతలో ఆకాశము మేఘములతోను గాలివానతోను కారు కమ్మెను; మోపైన వాన కురిసెను గనుక అహాబు రథమెక్కి యెజ్రెయేలునకు వెళ్లిపోయెను.
ఆయన భూమిమీద వర్షము కురిపించువాడు పొలములమీద నీళ్లు ప్రవహింపజేయువాడు.
ఆయన ఆజ్ఞ నియ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును, భూమ్యంత భాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్క జేయును, వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును, తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
జనముల వ్యర్థ దేవతలలో వర్షము కురిపింపగలవారున్నారా? ఆకాశము వాననియ్యగలదా? మా దేవుడవైన యెహోవా, నీవే గదా దాని చేయుచున్నావు? నీవే యీ క్రియలన్నియు చేయు చున్నావు; నీకొరకే మేము కనిపెట్టుచున్నాము.
ఆయన ఆజ్ఞ ఇయ్యగా జలరాసులు ఆకాశమండలములో పుట్టును. భూమ్యంతభాగములలోనుండి ఆయన ఆవిరి ఎక్కజేయును వర్షము కలుగునట్లుగా ఆయన మెరుపులు పుట్టించును తన ధనాగారములలోనుండి గాలిని రావించును.
కడవరి వానకాలమున వర్షము దయచేయుమని యెహోవాను వేడుకొనుడి . ప్రతివాని చేనిలోను పైరు మొలుచునట్లు యెహోవా మెరుపులను పుట్టించును, ఆయన వానలు మెండుగా కురిపించును .
గాలికి ఇంత బరువు ఉండవలెనని ఆయన నియమించినప్పుడు ప్రమాణమునుబట్టి జలములకు ఇంత కొలతయని ఆయన వాటిని కొలిచిచూచినప్పుడు
వర్షమునకు కట్టడ నియమించినప్పుడు ఉరుముతో కూడిన మెరుపునకు మార్గము ఏర్పరచినప్పుడు
వెలుగు విభాగింపబడు చోటికి మార్గమేది? తూర్పు గాలి యెక్కడనుండి వచ్చి భూమిమీద నఖ ముఖములను వ్యాపించును?
నిర్మానుష్య ప్రదేశముమీదను జనులులేని యెడారిలోను వర్షము కురిపించుటకును
పాడైన యెడారిని తృప్తిపరచుటకును లేత గడ్డి మొలిపించుటకును వరద నీటికి కాలువలను
ఉరుములోని మెరుపునకు మార్గమును నిర్ణయించువాడెవడు?
వర్షమునకు తండ్రి యున్నాడా? మంచు బిందువులను పుట్టించువాడెవడు?
నీవు హిమముయొక్క నిధులలోనికి చొచ్చితివా?
ఆపత్కాలముకొరకును యుద్ధముకొరకును యుద్ధదినముకొరకును నేను దాచియుంచిన వడగండ్ల నిధులను నీవు చూచితివా?
అయితే యెహోవా సముద్రముమీద పెద్ద గాలి పుట్టింపగా సముద్రమందు గొప్ప తుపాను రేగి ఓడ బద్దలైపోవుగతి వచ్చెను.
గాలి తన కిష్టమైన చోటను విసరును; నీవు దాని శబ్దము విందువేగాని అది యెక్కడనుండి వచ్చునో యెక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మమూలముగా జన్మించిన ప్రతివాడును ఆలాగే యున్నాడనెను.