దేవునిబట్టి నేను ఆయన వాక్యమును కీర్తించెదను దేవునియందు నమి్మకయుంచియున్నాను నేను భయపడను శరీరధారులు నన్నేమి చేయగలరు?
నేను మొఱ్ఱపెట్టు దినమున నా శత్రువులు వెనుకకు తిరుగుదురు. దేవుడు నా పక్షమున నున్నాడని నాకు తెలియును.
నేను దేవునియందు నమి్మకయుంచియున్నాను నేను భయపడను నరులు నన్నేమి చేయగలరు?
అయితే పరాక్రమముగల శూరునివలె యెహోవా నాకు తోడైయున్నాడు; నన్ను హింసించువారు నన్ను గెలువక తొట్రిల్లుదురు; వారు యుక్తిగా జరుపుకొనరు గనుక బహుగా సిగ్గుపడుదురు, వారెన్నడును మరువబడని నిత్యావమానము పొందుదురు.
నా శత్రువా , నామీద అతిశయింప వద్దు , నేను క్రిందపడినను , తిరిగి లేతును ; నేను అంధకారమందు కూర్చున్నను యెహోవా నాకు వెలుగుగా నుండును.
నేను యెహోవా దృష్టికి పాపము చేసితిని గనుక ఆయన నా పక్షమున వ్యాజ్యె మాడి నా పక్షమున న్యాయము తీర్చు వరకు నేను ఆయన కోపాగ్నిని సహింతును ; ఆయన నన్ను వెలుగులోనికి రప్పించును , ఆయన నీతిని నేను చూచెదను .
నా శత్రువు దాని చూచును . నీ దేవుడైన యెహోవా యెక్కడనని నాతో అనినది అవమానము నొందును , అది నా కండ్లకు అగపడును , ఇప్పుడు అది వీధిలోనున్న బురద వలె త్రొక్కబడును .
ఇట్లుండగా ఏమందుము ? దేవుడు మన పక్షముననుండగా మనకు విరోధి యెవడు ?
కాబట్టి ప్రభువు నాకుసహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు? అనిమంచి ధైర్యముతో చెప్పగలవారమై యున్నాము.