ప్రవేశించుడి
కీర్తనల గ్రంథము 65:1

దేవా, సీయోనులో మౌనముగానుండుట నీకు స్తుతి చెల్లించుటే నీకు మ్రొక్కుబడి చెల్లింపవలసియున్నది.

కీర్తనల గ్రంథము 66:13

దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.

కీర్తనల గ్రంథము 116:17-19
17

నేను నీకు కృతజ్ఞతార్పణ నర్పించెదను , యెహోవా నామమున ప్రార్థనచేసెదను

18

ఆయన ప్రజలందరియెదుటను యెహోవా మందిరపు ఆవరణములలోను

19

యెరూషలేమా , నీ మధ్యను నేను యెహోవాకు నా మ్రొక్కుబళ్లు చెల్లించెదను . యెహోవాను స్తుతించుడి .

యెషయా 35:10

వారి తలల మీద నిత్యా నందముండును వారు ఆనంద సంతోషములు గలవారై వచ్చెదరు. దుఃఖమును నిట్టూర్పును ఎగిరిపోవును .

కృతజ్ఞతార్పణలు చెల్లించుచు
కీర్తనల గ్రంథము 96:2

యెహోవామీద పాడుడి , ఆయన నామమును స్తుతించుడి అనుదినము ఆయన రక్షణసువార్తను ప్రకటించుడి .

కీర్తనల గ్రంథము 103:1

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము . నా అంతరంగముననున్న సమస్తమా , ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము .

కీర్తనల గ్రంథము 103:2

నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకుము

కీర్తనల గ్రంథము 103:20-22
20

యెహోవా దూతలారా , ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యము నెరవేర్చు బలశూరులారా , ఆయనను సన్నుతించుడి .

21

యెహోవా సైన్యములారా , ఆయన చిత్తము నెరవేర్చు ఆయన పరిచారకులారా , మీరందరు ఆయనను సన్నుతించుడి .

22

యెహోవా ఏలుచుండు స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా , ఆయనను స్తుతించుడి . నా ప్రాణమా , యెహోవాను సన్నుతించుము .

కీర్తనల గ్రంథము 145:1

రాజవైన నా దేవా, నిన్ను ఘనపరచెదను. నీ నామమును నిత్యము సన్నుతించెదను

కీర్తనల గ్రంథము 145:2

అనుదినము నేను నిన్ను స్తుతించెదను నిత్యము నీ నామమును స్తుతించెదను.

1దినవృత్తాంతములు 29:13

మా దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాము, ప్రభావముగల నీ నామమును కొనియాడుచున్నాము.

1దినవృత్తాంతములు 29:20

ఈలాగు పలికిన తరువాత దావీదు ఇప్పుడు మీ దేవుడైన యెహోవాను స్తుతించుడని సమాజకులందరితో చెప్పగా, వారందరును తమ పితరుల దేవుడైన యెహోవాను స్తుతించి యెహోవా సన్నిధిని రాజు ముందరను తలవంచి నమస్కారము చేసిరి.

కొలొస్సయులకు 3:16

సంగీతములతోను కీర్తనలతోను ఆత్మసంబంధమైన పద్యములతోను ఒకనికి ఒకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు కృపా సహితముగామీ హృదయములలో దేవునిగూర్చి గానము చేయుచు, సమస్తవిధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీలో సమృద్ధిగా నివసింపనియ్యుడి.

కొలొస్సయులకు 3:17

మరియు మాటచేత గాని క్రియచేత గాని, మీరేమి చేసినను ప్రభువైన యేసుద్వారా తండ్రియైన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు, సమస్తమును ఆయన పేరట చేయుడి.

హెబ్రీయులకు 13:15

కాబట్టి ఆయనద్వారా మనము దేవునికి ఎల్లప్పుడును స్తుతియాగము చేయుదము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు, జిహ్వాఫలము అర్పించుదము.