నా మంచము నాకు ఆదరణ ఇచ్చును.నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేననుకొనగా
నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.
రాత్రి పగలనియు చీకటి కమ్ముటయే వెలుగనియు వారు వాదించుచున్నారు.
రాత్రివేళను నా యెముకలు నాలో విరుగగొట్టబడునట్లున్నవి నన్ను బాధించు నొప్పులు నిద్రపోవు.
నీవు రేయింబగళ్లు భయపడుదువు. నీ ప్రాణము నీకు దక్కునను నమ్మకము నీకేమియు ఉండదు. నీ హృదయములో పుట్టు భయముచేతను, నీ కన్ను చూచువా అయ్యో యెప్పుడు సాయంకాలమగునా అనియు, సాయంకాలమున అయ్యో యెప్పుడు ఉదయమగునా అనియు అనుకొందువు.
నేను మూలుగుచు అలసియున్నాను ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్లచేత నా పడక కొట్టుకొని పోవుచున్నది.
నీవు నా కన్నులు మూతపడనీయవు. నేను కలవరపడుచు మాటలాడలేకయున్నాను.
కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము ప్రభువుకొరకు కనిపెట్టుచున్నది కావలివారు ఉదయముకొరకు కనిపెట్టుటకంటె ఎక్కువగా నా ప్రాణము కనిపెట్టుచున్నది.
సాగిపోయిన నీడవలె నేను క్షీణించియున్నాను మిడతలను పారదోలునట్లు నన్ను పారదోలుదురు
ప్రయాసపడి గాలివానచేత కొట్టబడి ఆదరణ లేక యున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడమును కట్టుదును నీలములతో నీ పునాదులను వేయుదును