the
యోబు గ్రంథము 27:4

నిశ్చయముగా నా పెదవులు అబద్ధము పలుకుటలేదు నా నాలుక మోసము నుచ్చరించుటలేదు.

సామెతలు 8:7

నా నోరు సత్యమైన మాటలు పలుకును దుష్టత్వము నా పెదవులకు అసహ్యము

సామెతలు 8:8

నా నోటి మాటలన్నియు నీతిగలవి వాటిలో మూర్ఖతయైనను కుటిలతయైనను లేదు

1 థెస్సలొనీకయులకు 2:3

ఏలయనగా మా బోధ కపటమైనది కాదు, అపవిత్రమైనది కాదు, మోసయుక్తమైనది కాదుగాని

1 థెస్సలొనీకయులకు 2:4

సువార్తను మాకు అప్పగించుటకు యోగ్యులమని దేవునివలన ఎంచబడిన వారమై, మనుష్యులను సంతోషపెట్టువారము కాక మన హృదయములను పరీక్షించు దేవునినే సంతోషపెట్టు వారమై బోధించుచున్నాము.

నా పెదవులు
యోబు గ్రంథము 15:2

జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?

యోబు గ్రంథము 36:3

దూరమునుండి నేను జ్ఞానము తెచ్చుకొందును నన్ను సృజించినవానికి నీతిని ఆరోపించెదను.

యోబు గ్రంథము 36:4

నా మాటలు ఏమాత్రమును అబద్ధములు కావు పూర్ణజ్ఞాని యొకడు నీ యెదుట నున్నాడు.

యోబు గ్రంథము 38:2

జ్ఞానములేని మాటలు చెప్పి ఆలోచనను చెరుపుచున్న వీడెవడు?

కీర్తనల గ్రంథము 37:30

నీతిమంతుల నోరు జ్ఞానమునుగూర్చి వచించును వారి నాలుక న్యాయమును ప్రకటించును.

కీర్తనల గ్రంథము 37:31

వారి దేవుని ధర్మశాస్త్రము వారి హృదయములో నున్నది వారి అడుగులు జారవు.

సామెతలు 15:2

జ్ఞానుల నాలుక మనోహరమైన జ్ఞానాంశములు పలుకును బుద్ధిహీనుల నోరు మూఢవాక్యములు కుమ్మరించును.

సామెతలు 15:7

జ్ఞానుల పెదవులు తెలివిని వెదజల్లును బుద్ధిహీనుల మనస్సు స్థిరమైనది కాదు

సామెతలు 20:15

బంగారును విస్తారమైన ముత్యములును కలవు. తెలివి నుచ్చరించు పెదవులు అమూల్యమైన సొత్తు.