కఠినుడవైతివి
యోబు గ్రంథము 7:20

నేను పాపముచేసితినా? నరులను కనిపెట్టువాడా, నేను నీ యెడల ఏమి చేయగలను?నాకు నేనే భారముగానున్నాను, నీవేల గురి పెట్టితివి?

యోబు గ్రంథము 7:21

నీవేల నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు?నేనిప్పుడు మంటిలో పండుకొనెదను నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేనులేక పోయెదను.

యోబు గ్రంథము 10:14-17
14

నేను పాపము చేసినయెడల నీవు దాని కనిపెట్టుదువు నా దోషమునకు పరిహారము చేయకుందువు.

15

నేను దోషకృత్యములు చేసినయెడల నాకు బాధకలుగును నేను నిర్దోషినైయుండినను అతిశయపడను అవమానముతో నిండుకొని నాకు కలిగిన బాధను తలంచుకొనుచుండెదను.

16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

17

సింహము వేటాడునట్లు నీవు నన్ను వేటాడుచుందువు ఎడతెగక నామీదికి క్రొత్త సాక్షులను పిలిచెదవు ఎడతెగక నామీద నీ ఉగ్రతను పెంచెదవు ఎడతెగక సమూహము వెనుక సమూహమును నా మీదికి రాజేసెదవు.

యోబు గ్రంథము 13:25-28
25

ఇటు అటు కొట్టుకొనిపోవుచున్న ఆకును నీవు వేధించెదవా?ఎండిపోయిన చెత్తను తరుముదువా?

26

నీవు నాకు కఠినమైన శిక్ష విధించియున్నావు నా బాల్యకాలపు పాపములను నాకు స్వాస్థ్యముగా నీవు విధించియున్నావు

27

బొండలలో నా కాళ్లు బిగించియున్నావు నా ప్రవర్తన అంతయు నీవు కనిపెట్టుచున్నావు నా అరికాళ్లచుట్టు గిఱిగీసియున్నావు

28

మురిగి క్షీణించుచున్న వానిచుట్టు చిమ్మటకొట్టిన వస్త్రమువంటివానిచుట్టు గిఱిగీసి వానిని కనిపెట్టుచున్నావు.

యోబు గ్రంథము 16:9-14
9

ఆయన తన కోపముచేత నామీద పడి నన్ను చీల్చెను.ఆయన నామీద పండ్లు కొరుకుచుండెను నాకు శత్రువై నామీద తన కన్నులు ఎఱ్ఱచేసెను.

10

జనులు నామీద తమ నోరు తెరతురు నన్ను తిట్టి చెంపమీద కొట్టుదురు.వారు ఏకీభవించి నామీద గుంపు కూడుదురు

11

దేవుడు నన్ను దుర్మార్గులకు అప్పగించియున్నాడు భక్తిహీనుల వశమున నన్ను ఉంచియున్నాడు.

12

నేను నెమ్మదిగానుంటిని అయితే ఆయన నన్ను ముక్కలు చెక్కలు చేసియున్నాడు మెడ పట్టుకొని విదలించి నన్ను తుత్తునియలుగా చేసియున్నాడు.తనకు నన్ను గురిదిబ్బగా నిలిపియున్నాడు

13

ఆయన బాణములు నన్ను చుట్టుకొనుచున్నవి కనికరములేక నా తుండ్లను పొడిచెను నా పైత్యరసమును నేలను పారబోసెను.

14

కన్నముమీద కన్నమువేసి ఆయన నన్ను విరుగగొట్టెను పరుగులెత్తి శూరునివలె నామీద పడెను.

యోబు గ్రంథము 19:6-9
6

ఆలాగైతే దేవుడు నాకు అన్యాయము చేసెననియు తన వలలో నన్ను చిక్కించుకొనెననియు మీరు తెలిసికొనుడి.

7

నామీద బలాత్కారము జరుగుచున్నదని నేను మొఱ్ఱపెట్టుచున్నాను గాని నా మొఱ్ఱ అంగీకరింపబడదు సహాయము నిమిత్తము నేను మొరలిడుచున్నాను గాని న్యాయము దొరకదు.

8

నేను దాటలేకుండ ఆయన నా మార్గమునకు కంచెవేసియున్నాడు.నా త్రోవలను చీకటి చేసియున్నాడు

9

ఆయన నా ఘనతను కొట్టివేసియున్నాడు తలమీదనుండి నా కిరీటమును తీసివేసియున్నాడు.

కీర్తనల గ్రంథము 77:7-9
7

ప్రభువు నిత్యము విడనాడునా? ఆయన ఇకెన్నడును కటాక్షింపడా?

8

ఆయన కృప ఎన్నటికిలేకుండ మానిపోయెనా? ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయెనా?

9

దేవుడు కటాక్షింపమానెనా? ఆయన కోపించి వాత్సల్యత చూపకుండునా?(సెలా.)

యిర్మీయా 30:14

నీ స్నేహితులందరు నిన్ను మరచియున్నారు, వారు నిన్ను గూర్చి విచారింపరు.

నీ బాహుబలముచేత
యోబు గ్రంథము 6:9

దేవుడు తన యిష్టానుసారముగా నన్ను నలుపును గాక చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలముచేయును గాక.

యోబు గ్రంథము 23:6

ఆయన తన అధికబలముచేత నాతో వ్యాజ్యెమాడునా?ఆయన ఆలాగు చేయక నా మనవి ఆలకించును

కీర్తనల గ్రంథము 89:13

పరాక్రమముగల బాహువు నీకు కలదు నీ హస్తము బలమైనది నీ దక్షిణహస్తము ఉన్నతమైనది .

1 పేతురు 5:6

దేవుడు తగిన సమయమందు మిమ్మును హెచ్చించునట్లు ఆయన బలిష్ఠమైన చేతిక్రింద దీనమనస్కులై యుండుడి.