భీకరమైనవి
యోబు గ్రంథము 6:4

సర్వశక్తుడగు దేవుని అంబులు నాలో చొచ్చెను వాటి విషమును నా ఆత్మ పానముచేయుచున్నది దేవుని భీకరకార్యములు నాతో యుద్ధము చేయుటకై పంక్తులు తీరుచున్నవి.

యోబు గ్రంథము 7:14

నీవు స్వప్నములవలన నన్ను బెదరించెదవు దర్శనములవలన నన్ను భయపెట్టెదవు.

యోబు గ్రంథము 9:27

నా శ్రమను మరచిపోయెదననియు దుఃఖముఖుడనైయుండుట మాని సంతోషముగానుండెదననియు నేను అనుకొంటినా?

యోబు గ్రంథము 9:28

నా సమస్త బాధలకు భయపడి వణకుచున్నాను నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగియున్నాను

యోబు గ్రంథము 10:16

నేను సంతోషించినయెడల ఎడతెగక నీ ఆశ్చర్యమైన బలమును నీవు నామీద చూపుదువు.

కీర్తనల గ్రంథము 88:15

బాల్యమునుండి నేను బాధపడి చావునకు సిద్ధమైతిని నీవు పెట్టు భయముచేత నేను కలవరపడుచున్నాను.

మేఘమువలె
యెషయా 44:22

మంచు విడిపోవునట్లుగా నేను నీ యతిక్రమములను మబ్బు తొలగునట్లుగా నీ పాపములను తుడిచివేసి యున్నాను నేను నిన్ను విమోచించియున్నాను, నాయొద్దకు మళ్లుకొనుము.

హొషేయ 6:4

ఎఫ్రాయిమూ, నిన్ను నేనేమి చేతును? యూదా, నిన్ను నేనేమి చేతును? తెల్లవారగానే కనబడు మేఘము ఎగిరిపోవునట్లును, ప్రాతఃకాలమున పడు మంచు ఆరిపోవునట్లును మీ భక్తి నిలువకపోవును.

హొషేయ 13:3

కాబట్టి వారు ఉదయమున కనబడు మేఘమువలెను పెందలకడ గతించు ప్రాతఃకాలపు మంచువలె నుందురు; కళ్లములోనుండి గాలి యెగురగొట్టు పొట్టువలెను, కిటకీలోగుండ పోవు పొగవలె నుందురు.