నాకు నిట్టూర్పు
యోబు గ్రంథము 7:19

ఎంత కాలము నీవు నన్ను చూచుట మానకుందువు?నేను గుటకవేయువరకు నన్ను విడిచిపెట్టవా?

కీర్తనల గ్రంథము 80:5

కన్నీళ్లు వారికి ఆహారముగా ఇచ్చుచున్నావు.విస్తారమైన కన్నీళ్లు నీవు వారికి పానముగా ఇచ్చుచున్నావు.

కీర్తనల గ్రంథము 102:9

నీ కోపాగ్నినిబట్టియు నీ ఆగ్రహమునుబట్టియు బూడిదెను ఆహారముగా భుజించుచున్నాను .

నా మొఱ్ఱలు
కీర్తనల గ్రంథము 22:1

నా దేవా నా దేవా, నీవు నన్నేల విడనాడితివి? నన్ను రక్షింపక నా ఆర్తధ్వని వినక నీవేల దూరముగానున్నావు?

కీర్తనల గ్రంథము 22:2

నా దేవా, పగలు నేను మొఱ్ఱపెట్టుచున్నాను రాత్రివేళను నేను మౌనముగా నుండుట లేదు అయినను నీవు నా కుత్తరమియ్యకున్నావు.

కీర్తనల గ్రంథము 32:3

నేను మౌనినై యుండగా దినమంతయు నేను చేసిన నా ఆర్తధ్వనివలన నాయెముకలు క్షీణించినవి.

కీర్తనల గ్రంథము 38:8

నేను సొమ్మసిల్లి బహుగా నలిగియున్నాను నా మనోవేదననుబట్టి కేకలు వేయుచున్నాను

యెషయా 59:11

మేమందరము ఎలుగుబంట్లవలె బొబ్బరించుచున్నాము గువ్వలవలె దుఃఖరవము చేయుచున్నాము న్యాయముకొరకు కాచుకొనుచున్నాము గాని అది లభించుటలేదు రక్షణకొరకు కాచుకొనుచున్నాము గాని అది మాకు దూరముగా ఉన్నది

విలాపవాక్యములు 3:8

నేను బతిమాలి మొరలిడినను నా ప్రార్థన వినబడకుండ తన చెవి మూసికొని యున్నాడు.