ఎవడైన ఈ సంగతి యెత్తి నీతో మాటలాడినయెడల నీకు వ్యసనము కలుగునా? అయితే వాదింపక ఎవడు ఊరకొనగలడు?
కావున నేను నా నోరు మూసికొనను నా ఆత్మ వేదనకొలది నేను మాటలాడెదను నా మనోవేదననుబట్టి మూల్గుచుండెదను.
విస్తారమైన మాటలలో దోషముండక మానదు తన పెదవులను మూసికొనువాడు బుద్ధిమంతుడు.
నా ప్రియ సహోదరులారా, మీరీసంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాటలాడుటకు నిదానించువాడును, కోపించుటకు నిదా నించువాడునై యుండవలెను.
నన్ను తేరిచూచి ఆశ్చర్యపడుడి నోటిమీద చేయి వేసికొనుడి.
చిత్తగించుము, నేను నీచుడను, నేను, నీకు ఏమని ప్రత్యుత్తరమిచ్చెదను? నా నోటిమీద నా చేతిని ఉంచుకొందును.
వారునీవు ఊరకుండుము, నీ చెయ్యి నీ నోటి మీద ఉంచుకొని మాతోకూడ వచ్చి మాకు తండ్రివిగాను యాజకుడవుగాను ఉండుము, ఒకని యింటివారికే యాజకుడవై యుండుట నీకు మంచిదా, ఇశ్రాయేలీయులలో ఒక గోత్రమునకును కుటుంబమునకును యాజకుడవైయుండుట మంచిదా? అని యడిగిరి.
నీవు బుద్ధిహీనుడవై అతిశయపడి యుండినయెడల కీడు యోచించి యుండినయెడల నీ చేతితో నోరు మూసికొనుము.