దేవునికి స్తుతి యాగము చేయుము మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము.
ఆపత్కాలమున నీవు నన్నుగూర్చి మొఱ్ఱపెట్టుము నేను నిన్ను విడిపించెదను నీవు నన్ను మహిమపరచెదవు.
ఆయనకు నేను మొఱ్ఱపెట్టితిని అప్పుడే నా నోట శ్రేష్ఠమైన కీర్తనయుండెను.
నా హృదయములో నేను పాపమును లక్ష్యము చేసిన యెడల ప్రభువు నా మనవి వినకపోవును.
నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించియున్నాడు ఆయన నా విజ్ఞాపన ఆలకించియున్నాడు
దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు నాయొద్దనుండి తన కృపను తొలగింపలేదు; ఆయన సన్నుతింపబడును గాక.
అతడు నాకు మొఱ్ఱపెట్టగా నేనతనికి ఉత్తరమిచ్చెదను శ్రమలో నేనతనికి తోడైయుండెదను అతని విడిపించి అతని గొప్పచేసెదను
అప్పుడు నీవు పిలువగా యెహోవా ఉత్తర మిచ్చును నీవు మొఱ్ఱపెట్టగా ఆయన నేనున్నా ననును . ఇతరులను బాధించుటయు వ్రేలుపెట్టి చూపి తిరస్కరించుటయు చెడ్డదానినిబట్టి మాటలాడుటయు నీవు మాని
మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలంకించునని మన మెరిగినయెడల మనమాయనను వేడుకొనినవి మనకు కలిగిన వని యెరుగుదుము.
తన సహోదరుడు మరణకరము కాని పాపము చేయగా ఎవడైనను చూచినయెడల అతడు వేడు కొనును; అతనిబట్టి దేవుడు మరణకరముకాని పాపము చేసినవారికి జీవము దయచేయును. మరణకరమైన పాపము కలదు. అట్టిదానిగూర్చి వేడుకొనవలెనని నేను చెప్పుటలేదు.
దేవా, నీవు మరణములోనుండి నా ప్రాణమును తప్పించియున్నావు నేను జీవపు వెలుగులో దేవుని సన్నిధిని సంచరించునట్లు జారిపడకుండ నీవు నా పాదములను తప్పించియున్నావు.
దహనబలులను తీసికొని నేను నీ మందిరములోనికి వచ్చెదను.
నాకు శ్రమ కలిగినప్పుడు నా పెదవులు పలికిన మ్రొక్కుబడులను నా నోరు వచించిన మ్రొక్కుబడులను నేను నీకు చెల్లించెదను
నీవు దేవునికి మ్రొక్కుబడి చేసికొనినయెడల దానిని చెల్లించుటకు ఆలస్యము చేయకుము;బుద్ధిహీనులయందు ఆయన కిష్టము లేదు.
కృతజ్ఞతాస్తుతులు చెల్లించి నేను నీకు బలుల నర్పింతును, నేను మ్రొక్కుకొనిన మ్రొక్కుబళ్లను చెల్లింపకమానను. యెహోవాయొద్దనే రక్షణ దొరకును అని ప్రార్థించెను.