నా బంధువులు నాయొద్దకు రాకయున్నారు నా ప్రాణస్నేహితులు నన్ను మరచిపోయియున్నారు.
వారు బేత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరి వారందరు వారియొద్దకు గుంపుకూడి వచ్చి ఈమె నయోమి గదా అని అనుకొనుచుండగా
ఆమె సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగజేసెను గనుక నన్ను నయోమి అనక మారా అనుడి .
నేను సమృధ్దిగల దాననై వెళ్లితిని , యెహోవా నన్ను రిక్తురాలినిగా తిరిగి రాజేసెను . మీరు నన్ను నయోమి అని పిలువ నేల ? యెహోవా నామీద విరుద్ధముగ సాక్ష్యము పలికెను , సర్వశక్తుడు నన్ను బాధపరచెను అని వారితో చెప్పెను .
దాని ఘనులు హిమముకన్న శుద్ధమైనవారు వారు పాలకంటె తెల్లనివారు వారి శరీరములు పగడములకంటె ఎఱ్ఱనివి వారి దేహకాంతి నీలమువంటిది.
అట్టివారి ఆకారము బొగ్గుకంటె నలుపాయెను వారిని వీధులలో చూచువారు వారిని గురుతు పట్ట జాలరు. వారి చర్మము వారి యెముకలకు అంటుకొనియున్నది అది యెండి కఱ్ఱవంటిదాయెను.
ఏశావు తన తండ్రి మాటలు వినినప్పుడు దుఃఖాక్రాంతుడై పెద్దకేక వేసి ఓ నా తండ్రీ, నన్నును దీవించుమని తన తండ్రితో చెప్పెను.
యెహోవా దూత ఇశ్రాయేలీయులందరితో ఈ మాటలు చెప్పగా
దూతలు సౌలు గిబియాకు వచ్చి జనులకు ఆ వర్తమానము తెలియజెప్పగా జను లందరు బిగ్గరగా ఏడ్చిరి .
ఇక ఏడ్చుటకు శక్తి లేక పోవునంత బిగ్గరగా ఏడ్చిరి .
అతడు ఆ మాటలాడ చాలింపగానే రాజకుమారులు వచ్చి బిగ్గరగా ఏడ్వ సాగిరి, రాజును అతని సేవకులందరును దీనిని చూచి బహుగా ఏడ్చిరి.
జరిగినదంతయు తెలియగానే మొర్దెకై తన బట్టలు చింపుకొని గోనెపట్టలు వేసికొని బూడిదె పోసికొని పట్టణము మధ్యకు బయలువెళ్లి మహా శోకముతో రోదనముచేసి
అప్పుడు యోబు లేచి తన పై వస్త్రమును చింపుకొని తలవెండ్రుకలు గొరిగించుకొని నేలమీద సాష్టాంగపడి నమస్కారముచేసి ఇట్లనెను
ఈ నెల యిరువది నాలుగవ దినమందు ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలుకట్టుకొని తలమీద ధూళిపోసికొని కూడివచ్చిరి.
సీయోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు తలలమీద బుగ్గి పోసికొందురు గోనెపట్ట కట్టు కొందురు యెరూషలేము కన్యకలు నేలమట్టుకు తలవంచు కొందురు.
నిన్నుగూర్చి మహా శోకమెత్తి ప్రలాపించుచు , తమ తలల మీద బుగ్గి పోసికొనుచు , బూడిదెలో పొర్లుచు
తమ తలలమీద దుమ్ముపోసికొని యేడ్చుచు దుఃఖించుచు అయ్యో, అయ్యో, ఆ మహాపట్టణము; అందులో సముద్రముమీద ఓడలుగల వారందరు, దానియందలి అధిక వ్యయముచేత ధనవంతులైరి; అది ఒక్క గడియలో పాడైపోయెనే అని చెప్పుకొనుచు కేకలు వేయుచుండిరి.