ప్రగల్భములను
యోబు గ్రంథము 13:4

మీరైతే అబద్ధములు కల్పించువారు.మీరందరు పనికిమాలిన వైద్యులు.

యోబు గ్రంథము 15:2

జ్ఞానముగలవాడు నిరర్థకమైన తెలివితో ప్రత్యుత్తరమియ్యదగునా? తూర్పుగాలితో తన కడుపు నింపుకొనదగునా?

యోబు గ్రంథము 15:3

వ్యర్థసంభాషణచేత వ్యాజ్యెమాడదగునా? నిష్‌ప్రయోజనమైన మాటలచేత వాదింపదగునా?

యోబు గ్రంథము 24:25

ఇప్పుడు ఈలాగు జరుగనియెడల నేను అబద్ధికుడనని రుజువుపరచువాడెవడు? నా మాటలు వట్టివని దృష్టాంతపరచువాడెవడు?

అపహసింప
యోబు గ్రంథము 12:4

నా స్నేహితునికి అపహాస్యాస్పదముగా నుండవలసివచ్చెను.నీతియు యథార్థతయు గలవాడు అపహాస్యాస్పదముగా నుండవలసి వచ్చెను.

యోబు గ్రంథము 13:9

ఆయన మిమ్మును పరిశోధించుట మీకు క్షేమమా?లేక ఒకడు నరులను మోసముచేయునట్లు మీరు ఆయనను మోసముచేయుదురా?

యోబు గ్రంథము 17:2

ఎగతాళి చేయువారు నాయొద్ద చేరియున్నారు వారు పుట్టించు వివాదములు నా కన్నుల కెదురుగానున్నవి.

యోబు గ్రంథము 34:7

యోబువంటి మానవుడెవడు? అతడు మంచి నీళ్లవలె తిరస్కారమును పానముచేయుచున్నాడు.

కీర్తనల గ్రంథము 35:16

విందుకాలమునందు దూషణలాడు వదరుబోతులవలె వారు నా మీద పండ్లుకొరికిరి.

యిర్మీయా 15:17

సంతోషించువారి సమూహములో నేను కూర్చుండలేదు నేను ఉల్ల సింపలేదు. కడుపు మంటతో నీవు నన్ను నింపి యున్నావు గనుక, నీ హస్తమునుబట్టి నేను ఏకాకినై కూర్చుంటిని.

యూదా 1:18

మన ప్రభువైన యేసుక్రీస్తు అపొస్తలులు పూర్వమందు మీతో చెప్పిన మాటలను జ్ఞాపకము చేసికొనుడి.

make thee
కీర్తనల గ్రంథము 83:16

యెహోవా , వారు నీ నామమును వెదకునట్లు వారికి పూర్ణావమానము కలుగజేయుము .

2 థెస్సలొనీకయులకు 3:14

ఈ పత్రిక మూలముగా మేము చెప్పిన మాటకు ఎవడైనను లోబడని యెడల అతనిని కనిపెట్టి, అతడు సిగ్గుపడు నిమిత్తము అతనితో సాంగత్యము చేయకుడి.

తీతుకు 2:8

నీ ఉపదేశము మోసములేనిదిగాను మాన్య మైనదిగాను నిరాక్షేపమైన హితవాక్యముతో కూడినదిగాను ఉండవలెను.