For how
ఆదికాండము 44:34

ఈ చిన్నవాడు నాతోకూడ లేనియెడల నా తండ్రియొద్దకు నేనెట్లు వెళ్లగలను? వెళ్లినయెడల నా తండ్రికి వచ్చు అపాయము చూడవలసివచ్చునని చెప్పెను.

యిర్మీయా 4:19

నా కడుపు, నా కడుపు, నా అంతరంగములో నా కెంతో వేదనగానున్నది; నా గుండె నరములు, నా గుండె కొట్టుకొనుచున్నది, తాళలేను; నా ప్రాణమా, బాకానాదము వినబడుచున్నది గదా, యుద్ధఘోష నీకు వినబడుచున్నది గదా?

యిర్మీయా 9:1

నా జనులలో హతమైనవారినిగూర్చి నేను దివా రాత్రము కన్నీరు విడుచునట్లు నా తల జలమయము గాను నా కన్ను కన్నీళ్ల ఊటగాను ఉండును గాక.

లూకా 19:41

ఆయన పట్టణమునకు సమీపించి నప్పుడు దానిని చూచి దాని విషయమై యేడ్చి

లూకా 19:42

నీవును ఈ నీ దినమందైనను సమాధానసంబంధమైన సంగతులను తెలిసికొనిన యెడల నీకెంతో మేలు ; గాని యిప్పుడవి నీ కన్నులకు మరుగు చేయబడియున్నవి .

రోమీయులకు 9:2

క్రీస్తు నందు నిజమే చెప్పుచున్నాను , అబద్ధమాడుట లేదు .

రోమీయులకు 9:3

పరిశుద్ధాత్మ యందు నా మనస్సాక్షి నాతోకూడ సాక్ష్యమిచ్చుచున్నది . సాధ్యమైనయెడల, దేహ సంబంధులైన నా సహోదరుల కొరకు నేను క్రీస్తు నుండి వేరై శాపగ్రస్తుడనై యుండ గోరుదును .

రోమీయులకు 10:1

సహోదరులారా , ఇశ్రాయేలీయులు రక్షణపొందవలెనని నా హృదయా భిలాషయు , వారి విషయమై నేను దేవుని కి చేయు ప్రార్థనయునై యున్నవి.

కీడును
ఎస్తేరు 7:4

సంహరింపబడుటకును, హతము చేయబడి నశించుటకును, నేనును నా జనులును కూడ అమ్మబడినవారము. మేము దాసులముగాను దాసురాండ్రముగాను అమ్మబడిన యెడల నేను మౌనముగా నుందును; ఏలయనగా మా విరోధిని తప్పించుకొనుటకై మేము రాజవగు తమరిని శ్రమపరచుట యుక్తము కాదు.

నెహెమ్యా 2:3

నేను మిగుల భయపడి రాజు చిరంజీవియగునుగాక, నా పితరుల సమాధులుండు పట్టణము పాడైపోయి, దాని గుమ్మములును అగ్నిచేత కాల్చబడియుండగా నాకు దుఃఖముఖము లేకపోవునా అని రాజుతో అంటిని.