రాజు ఎస్తేరు రాణీ, నీ విజ్ఞాపన మేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? రాజ్యములో సగముమట్టుకైనను నీకనుగ్రహించెదనని రెండవనాడు ద్రాక్షారసపు విందులో ఎస్తేరుతో అనెను.
రాజు రాణియైన ఎస్తేరుతో యూదులు షూషను కోటయందు ఐదువందలమందిని హామానుయొక్క పదిమంది కుమారులను బొత్తిగా నాశనము చేసియున్నారు; రాజుయొక్క కొదువ సంస్థానములలో వారు ఏమి చేసియుందురో; ఇప్పుడు నీ మనవి ఏమిటి? అది నీకనుగ్రహింపబడును,నీవు ఇంకను అడుగునదేమి? అది దయచేయబడునని సెలవియ్యగా
ఒక చిన్న మనవిచేయ గోరుచున్నాను; నా మాట త్రోసివేయకుమని ఆమె చెప్పగా రాజు నా తల్లీ చెప్పుము, నీ మాట త్రోసివేయననగా
గిబియోనులో యెహోవా రాత్రివేళ స్వప్నమందు సొలొమోనునకు ప్రత్యక్షమై నేను నీకు దేని నిచ్చుట నీకిష్టమోదాని నడుగుమని దేవుడు అతనితో సెలవియ్యగా
అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయనయొద్దకు వచ్చి నమస్కారముచేసి యొక మనవి చేయబోగా
నీవేమి కోరుచున్నావని ఆయన అడిగెను. అందుకామెనీ రాజ్యమందు ఈ నా యిద్దరు కుమారులలో ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ యెడమవైపునను కూర్చుండ సెలవిమ్మని ఆయనతో అనెను.
అందుకు యేసుమీరేమి అడుగుచున్నారో అది మీకు తెలియదు; నేను త్రాగబోవు గిన్నెలోనిది మీరు త్రాగగలరా? అని అడుగగా వారుత్రాగగలమనిరి.
వాడు దగ్గరకు వచ్చినప్పుడు ఆయన నేను నీకేమి చేయ గోరుచున్నావని అడుగగా, వాడు ప్రభువా, చూపు పొందగోరుచున్నా ననెను.
రాజు ద్రాక్షారసపు విందుకు కూర్చుండి ఎస్తేరును చూచి నీ కోరిక యేమిటి? అది నీకనుగ్రహింపబడును, నీ మనవి యేమిటి? అది రాజ్యములో సగముమట్టుకైనను చేయబడునని చెప్పగా
మరియునీవు నా రాజ్యములో సగముమట్టుకు ఏమి అడిగినను నీకిచ్చెదనని అతడు ఆమెతో ఒట్టుపెట్టుకొనెను