అతడు ఒకనికి అయిదు తలాంతులను1 ఒకనికి రెండు, ఒకనికి ఒకటియు ఎవని సామర్థ్యము చొప్పున వానికిచ్చి, వెంటనే దేశాంతరము పోయెను.
కలిగిన ప్రతివానికి ఇయ్యబడును అతనికి సమృద్ధి కలుగును; లేనివానియొద్దనుండి వానికి కలిగినదియు తీసి వేయబడును.
మొదట ఒకడు సిద్ధమైన మనస్సు కలిగియుంటే శక్తికి మించి కాదు గాని కలిమి కొలదియే యిచ్చినది ప్రీతికరమవును.
కాబట్టి మనకు సమయము దొరకినకొలది అందరియెడలను, విశేషముగా విశ్వాసగృహమునకు చేరినవారియెడలను మేలుచేయుదము.
పరదేశియేగాని నీయొద్ద నివసించువాడేగాని ధనసంపాదనము చేసికొనునప్పుడు అతనియొద్ద నివసించు నీ సహోదరుడు బీదవాడై నీయొద్ద నివసించు ఆ పరదేశికైనను ఆ పరదేశి కుటుంబములో వేరొకనికైనను తన్ను అమ్ముకొనిన యెడల
తన్ను అమ్ముకొనిన తరువాత వానికి విడుదలకావచ్చును. వాని సహోదరులలో ఒకడు వానిని విడిపింపవచ్చును.
వాని పినతండ్రియేగాని పినతండ్రి కుమారుడేగాని వాని వంశములో వాని రక్తసంబంధియేగాని వాని విడిపింపవచ్చును. కావలసిన క్రయధనము వానికి దొరికిన యెడల తన్ను తాను విడిపించుకొనవచ్చును.
ఒకడు నరుని దొంగిలించి అమి్మనను, తనయొద్ద నుంచుకొనినను, వాడు నిశ్చయముగా మరణశిక్షనొందును.
ఒకడు ఇశ్రాయేలు కుమారులైన తన సహోదరులలో నొకని దొంగిలుట కనుగొనబడినయెడల అతడు వానిని తన దాసునిగా చేసికొనినను అమి్మనను ఆ దొంగ చావవలెను. ఆలాగు చేసినయెడల ఆ చెడుతనమును మీ మధ్యనుండి పరిహరించుదురు.
అందువలన ఎవనికొరకు క్రీస్తు చనిపోయెనో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు నీ జ్ఞానమునుబట్టి నశించును.
ప్రధానులు మాటలాడక ఊరకొనిరి వారి నాలుక వారి అంగిలికి అంటుకొనెను.
వారు ఆశ్చర్యపడి ఇకను ఉత్తరమియ్యకయున్నారు పలుకుటకు వారికి మాటయొకటియు లేదు.
స్నేహితుడా, పెండ్లి వస్త్రములేక ఇక్కడి కేలాగు వచ్చితి వని అడుగగా వాడు మౌనియై యుండెను.
ప్రతి నోరు మూయబడునట్లును , సర్వ లోకము దేవుని శిక్షకు పాత్రమగునట్లును , ధర్మశాస్త్రము చెప్పుచున్న వాటి నన్నిటిని ధర్మశాస్త్రమునకు లోనైన వారితో చెప్పుచున్నదని యెరుగుదుము .