సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు
1 రాజులు 11:41-43
41

సొలొమోను చేసిన యితర కార్యములనుగూర్చియు అతడు చేసినదంతటిని గూర్చియు, అతని జ్ఞానమును గూర్చియు, సొలొమోను కార్యములను గూర్చిన గ్రంథమందు వ్రాయబడి యున్నది.

42

సొలొమోను యెరూషలేమునందు ఇశ్రాయేలీయులందరిని ఏలిన కాలము నలువది సంవత్సరములు.

43

అంతట సొలొమోను తన పితరులతో కూడ నిద్రించి, తన తండ్రియైన దావీదు పురమందు సమాధిచేయబడెను; తరువాత అతని కుమారుడైన రెహబాము అతనికి మారుగా రాజాయెను.

నాతాను
2 సమూయేలు 7:1-3
1

యెహోవా నలుదిక్కుల అతని శత్రువులమీద అతనికి విజయమిచ్చి అతనికి నెమ్మది కలుగజేసిన తరువాత రాజు తన నగరియందు కాపురముండి నాతానను ప్రవక్తను పిలువ నంపి

2

నేను దేవదారుమ్రానుతో కట్టిన నగరియందు వాసము చేయుచుండగా దేవుని మందసము డేరాలో నిలిచియున్నదనగా

3

నాతాను యెహోవా నీకు తోడుగా నున్నాడు, నీకు తోచినదంతయు నెరవేర్చుమనెను.

2 సమూయేలు 12:1

కావున యెహోవా నాతానును దావీదునొద్దకు పంపెను; అతడు వచ్చి దావీదుతో ఇట్లనెను ఒకానొక పట్టణమందు ఇద్దరు మనుష్యులు ఉండిరి.

2 సమూయేలు 12:25

యెహోవా అతనిని ప్రేమించి నాతాను అను ప్రవక్తను పంపగా అతడు యెహోవా ఆజ్ఞనుబట్టి యదీద్యా1 అని అతనికి పేరు పెట్టెను.

1 రాజులు 1:8

యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాయును ప్రవక్తయైన నాతానును షిమీయును రేయీయును దావీదుయొక్క శూరులును అదోనీయాతో కలిసికొనక యుండిరి.

1 రాజులు 1:10

ప్రవక్తయగు నాతానును బెనాయనును దావీదు శూరులను తనకు సహోదరుడైన సొలొమోనును పిలువలేదు.

1 రాజులు 1:11

అప్పుడు నాతాను సొలొమోను తల్లియైన బత్షెబతో చెప్పిన దేమనగా హగ్గీతు కుమారుడైన అదోనీయా యేలుచున్న సంగతి నీకు వినబడలేదా? అయితే ఈ సంగతి మన యేలినవాడైన దావీదునకు తెలియకయే యున్నది.

1 రాజులు 1:22-27
22

ఆమె రాజుతో మాటలాడుచున్నప్పుడు ప్రవక్తయగు నాతానును లోపలికిరాగా ప్రవక్తయగు నాతాను వచ్చియున్నాడని సేవకులు రాజునకు తెలియజేసిరి.

23

అతడు రాజు సన్నిధికి వచ్చి నమస్కారము చేసి సాష్టాంగపడి

24

నా యేలినవాడవైన రాజా, అదోనీయా నీ తరువాత ఏలువాడై నీ సింహాసనముమీద కూర్చుండునని నీవు సెలవిచ్చితివా?

25

ఏలయనగా ఈ దినమున అతడు పోయి విస్తారమైన యెడ్లను క్రొవ్విన దూడలను గొఱ్ఱలను బలిగా అర్పించి రాజకుమారులనందరిని సైన్యాధిపతులను యాజకుడైన అబ్యాతారును పిలిపింపగా వారు వాని సముఖములో అన్నపానములు పుచ్చుకొనుచు రాజైన అదోనీయా చిరంజీవియగునుగాక అని పలుకుచున్నారు.

26

అయితే నీ సేవకుడనైన నన్నును యాజకుడైన సాదోకును యెహోయాదా కుమారుడైన బెనాయాను నీ సేవకుడైన సొలొమోనును అతడు పిలిచినవాడు కాడు.

27

నా యేలినవాడవును రాజవునగు నీ తరువాత నీ సింహాసనముమీద ఎవడు ఆసీనుడై యుండునో అది నీ సేవకుడనైన నాతో చెప్పకయుందువా? ఈ కార్యము నా యేలినవాడవును రాజవునగు నీ సెలవుచొప్పున జరుగుచున్నదా? అని యడిగెను.

1 రాజులు 1:32-38
32

అప్పుడు రాజైన దావీదు యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాను నాయొద్దకు పిలువుమని సెలవియ్యగా వారు రాజు సన్నిధికి వచ్చిరి.

33

అంతట రాజు మీరు మీ యేలినవాడనైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచర గాడిదమీద ఎక్కించి గిహోనునకు తీసికొనిపోయి

34

యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును అక్కడ ఇశ్రాయేలీయులమీద రాజుగా అతనికి పట్టాభిషేకము చేసిన తరువాత మీరు బాకానాదము చేసి రాజైన సొలొమోను చిరంజీవియగునుగాక అని ప్రకటన చేయవలెను.

35

ఇశ్రాయేలు వారిమీదను యూదావారిమీదను నేనతనిని అధికారిగా నియమించియున్నాను గనుక పిమ్మట మీరు యెరూషలేమునకు అతని వెంటరాగా అతడు నా సింహాసనముమీద ఆసీనుడై నాకు ప్రతిగా రాజగును అని సెలవిచ్చెను.

36

అందుకు యెహోయాదా కుమారుడైన బెనాయా రాజునకు ప్రత్యుత్తరముగా ఇట్లనెను ఆలాగు జరుగును గాక, నా యేలినవాడవును రాజవునగు నీ దేవుడైన యెహోవా ఆ మాటను స్థిరపరచును గాక.

37

యెహోవా నా యేలినవాడవును రాజవునగు నీకు తోడుగా నుండినట్లు ఆయన సొలొమోనునకు తోడుగానుండి, నా యేలినవాడైన రాజగు దావీదుయొక్క రాజ్యముకంటె అతని రాజ్యము ఘనముగా చేయునుగాక అనెను;

38

కాబట్టి యాజకుడైన సాదోకును ప్రవక్తయైన నాతానును యెహోయాదా కుమారుడైన బెనాయాయును కెరేతీయులును పెలేతీయులును రాజైన దావీదు కంచరగాడిదమీద సొలొమోనును ఎక్కించి గిహోనునకు తీసికొని రాగా

1దినవృత్తాంతములు 29:29

రాజైన దావీదునకు జరిగినవాటన్నిటినిగూర్చియు, అతని రాజరికమంతటినిగూర్చియు, పరాక్రమమునుగూర్చియు, అతనికిని ఇశ్రాయేలీయులకును దేశముల రాజ్యములన్నిటికిని వచ్చిన కాలములనుగూర్చియు,

అహీయా
1 రాజులు 11:29

అంతట యరొబాము యెరూషలేములోనుండి బయలు వెడలిపోగా షిలోనీయుడును ప్రవక్తయునగు అహీయా అతనిని మార్గమందు కనుగొనెను; అహీయా క్రొత్తవస్త్రము ధరించుకొని యుండెను, వారిద్దరు తప్ప పొలములో మరి యెవడును లేకపోయెను.

1 రాజులు 14:2

యరొబాము తన భార్యతో ఇట్లనెను నీవు లేచి యరొబాము భార్యవని తెలియబడకుండ మారువేషము వేసికొని షిలోహునకు పొమ్ము; ఈ జనుల మీద నేను రాజునగుదునని నాకు సమాచారము తెలియజెప్పిన ప్రవక్తయగు అహీయా అక్కడ ఉన్నాడు.

ఇద్దోకు
2 దినవృత్తాంతములు 12:15

రెహబాము చేసిన కార్యములన్నిటిని గూర్చియు షెమయా రచించిన గ్రంథమందును దీర్ఘదర్శియైన ఇద్దో రచించిన వంశావళియందును వ్రాయబడియున్నది.

2 దినవృత్తాంతములు 13:22

అబీయా చేసిన యితర కార్యములను గూర్చియు, అతని చర్యను గూర్చియు, అతని కాలమున జరిగిన సంగతులను గూర్చియు ప్రవక్తయైన ఇద్దో రచించిన సటీక గ్రంథమునందు వ్రాయబడియున్నది.