యాజకులు
సంఖ్యాకాండము 6:23-26
23

మీరు ఇశ్రాయేలీయులను ఈలాగు దీవింపవలెను.

24

యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక;

25

యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక;

26

యెహోవా నీమీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగజేయును గాక.

ద్వితీయోపదేశకాండమ 10:8

నేటివరకు జరుగునట్లు యెహోవా నిబంధన మందసమును మోయుటకు, యెహోవా సన్నిధిని నిలుచుటకును, ఆయనను సేవించి ఆయన నామమునుబట్టి దీవించుటకును, లేవి గోత్రపువారిని ఆ కాలమున యెహోవా ఏర్పరచుకొనెను.

వారి ప్రార్థన
1 రాజులు 8:30

మరియు నీ దాసుడనైన నేనును నీ జనులైన ఇశ్రాయేలీయులును ఈ స్థలముతట్టు తిరిగి ప్రార్థన చేయునప్పుడెల్ల, నీ నివాసస్థానమైన ఆకాశమందు విని మా విన్నపము అంగీకరించుము; వినునప్పుడెల్ల మమ్మును క్షమించుము.

1 రాజులు 8:39

ప్రతి మనిషియొక్క హృదయము నీ వెరుగుదువు గనుక నీవు ఆకాశమను నీ నివాసస్థలమందు విని, క్షమించి దయచేసి యెవరి ప్రవర్తననుబట్టి వారికి ప్రతిఫలమిచ్చి

అపొస్తలుల కార్యములు 10:4

అతడు దూత వైపు తేరి చూచి భయపడి ప్రభువా, యేమని అడిగెను. అందుకు దూతనీ ప్రార్థనలును నీ ధర్మకార్యములును దేవుని సన్నిధికి జ్ఞాపకార్థముగా చేరినవి.

నీ పరిశుద్ధాలయమగు
ద్వితీయోపదేశకాండమ 26:15

నీ పరిశుద్ధాలయమగు ఆకాశములోనుండి చూచి, నీ జనులైన ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించు దేశము అని నీవు మా పితరులతో ప్రమాణము చేసినట్లు మాకిచ్చియున్న దేశమును ఆశీర్వదింపుమని చెప్పవలెను.

కీర్తనల గ్రంథము 68:5

తన పరిశుద్ధాలయమందుండు దేవుడు, తండ్రి లేనివారికి తండ్రియు విధవరాండ్రకు న్యాయకర్తయునైయున్నాడు

యెషయా 57:15

మహా ఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్యనివాసియునైనవాడు ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధస్థలములో నివసించు వాడను అయినను వినయముగలవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును నలిగినవారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును వినయముగలవారియొద్దను దీనమనస్సుగలవారియొద్దను నివసించుచున్నాను.

యెషయా 63:15

పరమునుండి చూడుము మహిమోన్నతమైన నీ పరిశుద్ధ నివాసస్థలమునుండి దృష్టించుము నీ ఆసక్తి యేది? నీ శౌర్యకార్యములేవి? నాయెడల నీకున్న జాలియు నీ వాత్సల్యతయు అణగిపోయెనే.

యెషయా 66:1

యెహోవా ఈలాగు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు ఆకాశము నా సింహాసనము భూమి నా పాద పీఠము మీరు నా నిమిత్తము కట్టనుద్దేశించు ఇల్లు ఏపాటిది? నాకు విశ్రమస్థానముగా మీరు కట్టనుద్దేశించునది ఏపాటిది?