ఇశ్రాయేలు రాజైన పెకహు దినములలో అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు వచ్చి ఈయోను పట్టణమును, ఆబేల్బేత్మయకా పట్టణమును, యానోయహు పట్టణమును, కెదెషు పట్టణమును, హాసోరు పట్టణమును, గిలాదు దేశమును, గలిలయ దేశమును,నఫ్తాలీ దేశ మంతయును పట్టుకొని అచ్చట నున్నవారిని అష్షూరు దేశమునకు చెరగా తీసికొని పోయెను.
ఇట్లుండగా ఆహాజు యెహోవా మందిర సంబంధమైనట్టియు రాజ నగరు సంబంధమైనట్టియు సామగ్రులలో కనబడిన వెండి బంగారములను తీసికొని అష్షూరు రాజునకు కానుకగా పంపి
నేను నీ దాసుడను నీ కుమారుడనైయున్నాను గనుక నీవు వచ్చి , నామీదికి లేచిన సిరియా రాజు చేతిలోనుండియు ఇశ్రాయేలు రాజు చేతిలోనుండియు నన్ను రక్షింపవలెనని అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరునొద్దకు దూతల నంపగా
అష్షూరు రాజు అతనిమాట అంగీకరించి , దమస్కు పట్టణముమీదికి వచ్చి దాని పట్టుకొని , రెజీనును హతముచేసి ఆ జనులను కీరు పట్టణమునకు చెరదీసికొని పోయెను.
రాజైన ఆహాజు అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరును కలిసికొనుటకై దమస్కు పట్టణమునకు వచ్చి , దమస్కు పట్టణమందు ఒక బలిపీఠమును చూచి , దాని పోలికెను , మచ్చును , దాని పని విధమంతయును యాజకుడైన ఊరియాకు పంపెను .
కాబట్టి ఇశ్రాయేలీయుల దేవుడు అష్షూరు రాజైన పూలు మనస్సును అష్షూరు రాజైన తిగ్లత్పిలేసెరు మనస్సును రేపగా అతడు రూబేనీయులను గాదీయులను మనష్షే అర్ధగోత్రమువారిని చెరపట్టి నేటికిని కనబడుచున్నట్లుగా హాలహునకును హాబోరునకును హారాకును గోజాను నదీప్రాంతములకును వారిని కొనిపోయెను.
తాను రోగి యవుట ఎఫ్రాయిము చూచెను , తనకు పుండు కలుగుట యూదా చూచెను అప్పుడు ఎఫ్రాయిము అష్షూరీయుల యొద్దకు పోయెను , రాజైన యారేబును పిలుచుకొనెను. అయితే అతడు నిన్ను స్వస్థ పరచజాలడు , నీ పుండు బాగు చేయజాలడు .
అష్షూరు రాజు దేశ మంతటిమీదికిని షోమ్రోనుమీదికిని వచ్చి మూడు సంవత్సరములు షోమ్రోనును ముట్టడించెను .
ఆ దినమున యెహోవా నది (యూప్రటీసు) అద్దరి నుండి కూలికి వచ్చు మంగలకత్తిచేతను, అనగా అష్షూరు రాజుచేతను తలవెండ్రుకలను కాళ్లవెండ్రుకలను క్షౌరము చేయించును, అది గడ్డముకూడను గీచివేయును.
ఫరోవలన కలుగు బలము మీకు అవమానకరమగును ఐగుప్తునీడను శరణుజొచ్చుటవలన సిగ్గు కలుగును.
అయినను మీరు సమ్మతింపక అట్లు కాదు, మేము గుఱ్ఱములనెక్కి పారిపోవుదుమంటిరి కాగా మీరు పారిపోవలసి వచ్చెను. మేము వడిగల గుఱ్ఱములను ఎక్కిపోయెదమంటిరే కాగా మిమ్మును తరుమువారు వడిగలవారుగా నుందురు.
చేతులు నెత్తిని బెట్టు కొని ఆ జనమునొద్దనుండి బయలు వెళ్లెదవు; యెహోవా నీ ఆశ్రయములను నిరాకరించుచున్నాడు. వాటివలన నీకు క్షేమము కలుగదు.