సిద్ధపరచగా
1 సమూయేలు 24:17

దావీదుతో ఇట్లనెను -యెహోవా నన్ను నీచేతి కప్పగింపగా నన్ను చంపక విడిచినందుకు

1 సమూయేలు 24:18

ఈ దినమున నీవు నా అపకారమునకు ఉపకారముచేసిన వాడవై, నా యెడల నీకున్న ఉపకారబుద్ధిని వెల్లడిచేసితివి గనుక నీవు నాకంటె నీతిపరుడవు.

2 దినవృత్తాంతములు 28:15

పేళ్లు ఉదాహరింపబడినవారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపుసొమ్ముచేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములను పాదరక్షలను ధరింపజేసి అన్నపానములిచ్చి తలలకు నూనె బెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదలమీద ఎక్కించి ఖర్జూరవృక్షములుగల పట్టణమగు యెరికోకు వారి సహోదరులయొద్దకు వారిని తోడుకొనివచ్చిరి; తరువాత వారు షోమ్రోనునకు మరల వెళ్లిరి.

సామెతలు 25:21

నీ పగవాడు ఆకలిగొనినయెడల వానికి భోజనము పెట్టుము దప్పిగొనినయెడల వానికి దాహమిమ్ము

సామెతలు 25:22

అట్లు చేయుటచేత వాని తలమీద నిప్పులు కుప్పగా పోయుదువు యెహోవా అందుకు నీకు ప్రతిఫలమిచ్చును.

మత్తయి 5:47

మీ సహోదరులకు మాత్రము వందనము చేసిన యెడల మీరు ఎక్కువ చేయుచున్నదేమి? అన్యజనులును ఆలాగు చేయుచున్నారు గదా.

లూకా 6:35

మీరైతే ఎట్టి వారిని గూర్చి యైనను నిరాశ చేసికొనక మీ శత్రువులను ప్రేమించుడి, మేలుచేయుడి, అప్పు ఇయ్యుడి; అప్పుడు మీ ఫలము గొప్పదైయుండును, మీరు సర్వోన్నతుని కుమారులై యుందురు. ఆయన, కృతజ్ఞతలేనివారియెడలను దుష్టులయెడలను ఉపకారియై యున్నాడు.

లూకా 10:29-37
29

అయితే తాను నీతిమంతుడైనట్టు కనబరచుకొనగోరి , అతడు అవును గాని నా పొరుగువా డెవడని యేసు నడిగెను .

30

అందుకు యేసు ఇట్లనెను ఒక మనుష్యుడు యెరూషలేము నుండి యెరికోపట్టణము నకు దిగి వెళ్లుచు దొంగల చేతిలో చిక్కెను ; వారు అతని బట్టలు దోచుకొని , అతని కొట్టి కొరప్రాణముతో విడిచి

31

అప్పుడొక యాజకుడు ఆ త్రోవను వెళ్లుట తటస్థించెను . అతడు అతనిని చూచి , ప్రక్కగా పోయెను .

32

ఆలాగుననే లేవీయుడొకడు ఆ చోటికి వచ్చి చూచి ప్రక్కగా పోయెను .

33

అయితే ఒక సమరయుడు ప్రయాణమై పోవుచు , అతడు పడియున్నచోటికి వచ్చి

34

అతనిని చూచి , అతనిమీద జాలిపడి , దగ్గరకుపోయి , నూనెయు ద్రాక్షారసమును పోసి అతని గాయములను కట్టి , తన వాహనము మీద ఎక్కించి యొక పూటకూళ్లవాని యింటికి తీసికొనిపోయి అతని పరమర్శించెను

35

మరునాడతడు రెండు దేనారములు తీసి ఆ పూట కూళ్లవాని కిచ్చి ఇతని పరామర్శించుము , నీవింకే మైనను ఖర్చు చేసినయెడల నేను మరల వచ్చునప్పుడు అది నీకు తీర్చెదనని అతనితో చెప్పి పోయెను .

36

కాగా దొంగలచేతిలో చిక్కినవానికి ఈ ముగ్గురిలో ఎవడు పొరుగువా డాయెనని నీకు తోచుచున్నది అని యేసు అడుగగా అతడు --అతని మీద జాలి పడినవాడే అనెను .

37

అందుకు యేసు నీవును వెళ్లి ఆలాగు చేయుమని అతనితో చెప్పెను .

దండువారు
2 రాజులు 6:8

సిరియా రాజు ఇశ్రాయేలుతో యుద్ధముచేయవలెనని కోరి తన సేవకులతో ఆలోచనచేసి ఫలాని స్థలమందు మన దండు పేట ఉంచుదమని చెప్పెను .

2 రాజులు 6:9

అయితే ఆ దైవ జనుడు ఇశ్రాయేలు రాజునకు వర్తమానము పంపి ఫలాని స్థలమునకు నీవు పోవద్దు , అచ్చటికి సిరియనులు వచ్చి దిగియున్నారని తెలియజేసెను గనుక

2 రాజులు 5:2

సిరియనులు గుంపు గుంపులుగా బయలుదేరి ఇశ్రాయేలు దేశముమీదికి పోయి యుండిరి. వారచ్చటనుండి యొక చిన్నదాని చెరగొని తేగా, అది నయమాను భార్యకు పరిచారము చేయుచుండెను .

2 రాజులు 24:2

యెహోవా అతనిమీదికిని, తన సేవకులైన ప్రవక్తలద్వారా తాను సెలవిచ్చిన మాటచొప్పున యూదాదేశమును నాశనముచేయుటకై దానిమీదికిని, కల్దీయుల సైన్యములను సిరియనుల సైన్యములను మోయాబీయుల సైన్యములను ఆమ్మోనీయుల సైన్యములను రప్పించెను.