ఎల్యా కీము
2 రాజులు 19:2

గృహనిర్వాహకుడగు ఎల్యాకీమును, శాస్త్రి షెబ్నాను, యాజకులలో పెద్దలను, ఆమోజు కుమారుడును ప్రవక్తయునైన యెషయాయొద్దకు పంపెను.

యెషయా 22:20-24
20
ఆ దినమున నేను నా సేవకుడును హిల్కీయా కుమా రుడునగు ఎల్యాకీమును పిలిచి
21
అతనికి నీ చొక్కాయిని తొడిగించి నీ నడికట్టుచేత ఆతని బలపరచి నీ అధికార మును అతనికిచ్చెదను; అతడు యెరూషలేము నివాసుల కును యూదా వంశస్థులకును తండ్రియగును.
22
నేను దావీదు ఇంటితాళపు అధికారభారమును అతని భుజముమీద ఉంచెదను అతడు తీయగా ఎవడును మూయజాలడు అతడు మూయగా ఎవడును తీయజాలడు
23
దిట్టమైనచోట మేకు కొట్టినట్టు నేను అతని స్థిర పరచెదను అతడు తన పితరులకుటుంబమునకు మాన్యతగల సింహాసనముగా నుండును.
24
గిన్నెలవంటి పాత్రలను బుడ్లవంటి సమస్తమైన చిన్న చెంబులను అనగా అతని పితరుల సంతాన సంబంధులగు పిల్లజల్ల లందరిని అతనిమీద వ్రేలాడించెదరు.
యెషయా 36:3

హిల్కీయా కూమారుడును రాజు గృహ నిర్వాహకుడును నైన ఎల్యాకీమును శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును వారియొద్దకు పోయిరి .

యెషయా 36:22

గృహ నిర్వాహకుడును హిల్కీయా కుమారుడునైన ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాయును , రాజ్యపు దస్తావేజులమీదనున్న ఆసాపు కుమారుడగు యోవాహును బట్టలు చింపుకొని హిజ్కియా యొద్దకు వచ్చి రబ్షాకే పలికిన మాటలన్నియు తెలియజెప్పిరి .

యెషయా 37:2

గృహ నిర్వాహకుడగు ఎల్యాకీమును , శాస్త్రియగు షెబ్నాను , యాజకులలో పెద్దలను , ఆమోజు కుమారుడును ప్రవక్తయు నైన యెషయా యొద్దకు పంపెను .

షెబ్నా
యెషయా 22:15-19
15
ప్రభువును సైన్యములకధిపతియునగు యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడుగృహ నిర్వాహకుడైన షెబ్నా అను ఈ విచారణకర్తయొద్దకు పోయి అతనితో ఇట్లనుము
16
ఇక్కడ నీ కేమి పని? ఇక్కడ నీ కెవరున్నారు? నీవిక్కడ సమాధిని తొలిపించుకొననేల? ఎత్తయినస్థలమున సమాధిని తొలిపించుకొనుచున్నాడు శిలలో తనకు నివాసము తొలిపించుకొనుచున్నాడు
17
ఇదిగో బలాఢ్యుడొకని విసరివేయునట్లు యెహోవా నిన్ను వడిగా విసరివేయును ఆయన నిన్ను గట్టిగా పట్టుకొనును
18
ఆయన నిన్ను మడిచి యొకడు చెండు వేసినట్టు విశాలమైన దేశములోనికి నిన్ను విసరివేయును. నీ యజమానుని ఇంటివారికి అవమానము తెచ్చిన వాడా, అక్కడనే నీవు మృతిబొందెదవు నీ ఘనమైన రథములు అక్కడనే పడియుండును
19
నీ స్థితినుండి యెహోవానగు నేను నిన్ను తొలగించె దను నీ ఉద్యోగమునుండి ఆయన నిన్ను త్రోసివేయును.
రాజ్యపుదస్తావేజుల మీద నున్న ఆసాపు కుమారుడైన యోవాహును
2 సమూయేలు 8:17

అహీటూబు కుమారుడగు సాదోకును అబ్యాతారు కుమారుడగు అహీమెలెకును యాజకులు; శెరాయా లేఖికుడు;

రాజ్యపుదస్తావేజుల
2 సమూయేలు 8:16

సెరూయా కుమారుడగు యోవాబు సైన్యమునకు అధిపతియై యుండెను. అహీలూదు కుమారుడగు యెహోషాపాతు రాజ్యపు దస్తావేజులమీద నుండెను.

2 సమూయేలు 20:24

అదోరాము వెట్టిపనులు చేయువారిమీద అధికారియై యుండెను;

1 రాజులు 4:3

షీషా కుమారులైన ఎలీహోరెపును అహీయాయును ప్రధాన మంత్రులు; అహీలూదు కుమారుడైన యెహోషాపాతు లేఖికుడై యుండెను;

2 దినవృత్తాంతములు 34:8

అతని యేలుబడియందు పదునెనిమిదవ సంవత్సరమున, దేశమును మందిరమును పవిత్రపరచుటయైన తరువాత, అతడు అజల్యా కుమారుడైన షాఫానును, పట్టాణాధిపతియైన మయశేయాను, రాజ్యపు దస్తావేజులమీదనున్న యోహాహాజు కుమారుడగు యోవాహాజును, తన దేవుడైన యెహోవా మందిరమును బాగుచేయుటకై పంపెను.