అప్పుడు షేమును యాపెతును వస్త్రమొకటి తీసికొని తమ యిద్దరి భుజములమీద వేసికొని వెనుకకు నడిచి వెళ్లి తమ తండ్రి దిసమొలను కప్పిరి; వారి ముఖములు వెనుకతట్టు ఉండుట
నిర్గమకాండము 20:12

నీ దేవుడైన యెహోవా నీకనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుష్మంతుడవగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము.

లేవీయకాండము 19:32

తల నెరసినవాని యెదుట లేచి ముసలివాని ముఖమును ఘనపరచి నీ దేవునికి భయపడవలెను; నేను యెహోవాను.

రోమీయులకు 13:7
ఇందుకే గదా మీరు పన్నుకూడ చెల్లించుచున్నారు? కాబట్టి యెవనికి పన్నో వానికి పన్నును, ఎవనికి సుంకమో వానికి సుంకమును చెల్లించుడి. ఎవనియెడల భయముండ వలెనో వానియెడల భయమును, ఎవనియెడల సన్మాన ముండవలెనో వాని యెడల సన్మానమును కలిగియుండి, అందరికిని వారి వారి ఋణములను తీర్చుడి.
గలతీయులకు 6:1

సహోదరులారా, ఒకడు ఏ తప్పితములోనైనను చిక్కుకొనినయెడల ఆత్మసంబంధులైన మీలో ప్రతివాడు తానును శోధింపబడుదునేమో అని తన విషయమై చూచుకొనుచు, సాత్వికమైన మనస్సుతో అట్టివానిని మంచిదారికి తీసికొనిరావలెను.

1 తిమోతికి 5:1

వృద్ధుని గద్దింపక తండ్రిగా భావించి అతని హెచ్చరించుము.

1 తిమోతికి 5:17

బాగుగా పాలనచేయు పెద్దలను , విశేషముగా వాక్య మందును ఉపదేశమందును ప్రయాసపడువారిని , రెట్టింపు సన్మానమునకు పాత్రులనుగా ఎంచవలెను .

1 తిమోతికి 5:19

మరియు పనివాడు తన జీతమునకు పాత్రుడు ఇద్దరు ముగ్గురు సాక్షులుంటేనేగాని పెద్దమీద దోషా రోపణ అంగీకరింప కుము

1 పేతురు 2:17

అందరిని సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి.

1 పేతురు 4:8

ప్రేమ అనేక పాపములను కప్పును గనుక అన్నిటికంటె ముఖ్యముగా ఒకనియెడల ఒకడు మిక్కటమైన ప్రేమగలవారై యుండుడి.